సంగెవేని రవీంద్ర కవిత స్పీడ్ బ్రేకర్

బుదవారం, ఫిబ్రవరి 1, 2012, 19:28 [IST]
Sangeveni Ravindra
అందరిలా
అందలాన్ని ఎక్కాలని
అనుకున్నా...

కొందరిలా ఎదగాలనే
కోరికల్ని పెంచుకున్నా...
అంతులేని బ్రేకులతో
అక్కడికక్కడే ఉన్నా....

అజ్ఞానం, అవిద్య,
చీమలల్లే జనం, జనం...
నిరుద్యోగ నిరంకుశం
ఆకలేమో అనుక్షణం...

రోగాలు, మోసాలు
పట్టపగలే వేషాలు
అయోమయం,
అధిక వ్యయం,
ఏదేదో భయం, భయం....

నీరుగారి పోయి నేను
నీరసంగా కూర్చున్నా...
సారే జహాసే పాట
సంబరంగా వింటున్నా....
English summary
Poet Sangeveni Ravindra explains about the obstructions in life.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs