బాలయ్య గొంతు రాంగ్ సిగ్నలా?

గురువారం, ఫిబ్రవరి 5, 2009, 15:50 [IST]
Balakrishna
హైదరాబాద్: ఒకనాడు తన తండ్రికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడని భావించిన హీరో బాలకృష్ణ మరో రకంగా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు డ్రామాలో బాలకృష్ణకు ఏ మాత్రం పాత్ర లేదు. ఆ వైస్రాయ్ డ్రామాలో హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ డ్రామాకు బాలకృష్ణ దూరంగా ఉన్నారు.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు నందమూరి వారసులను తెలుగుదేశానికి ప్రచారం చేసేలా రంగంలోకి దించుకుంటున్నారు. బహిరంగ సభల్లో బాలకృష్ణ గొంతు గొంతు బొంగురుపోవడానికి వెనుక ఎన్టీఆర్ ఆత్మ ఉందా? ఇప్పుడు "అరుంధతి" సినిమా ఆ సబ్జెక్ట్ తోనే సూపర్ డూపర్ హిట్ గా నడుస్తోంది. ఆ సినిమాకు హీరో వాల్యూ లేదు. కమెడీయన్స్ లేరు. అయినా నడుస్తోందంటే రెండు ఆత్మలతో కథను నడిపించడమే కారణం కావచ్చు.

బాలకృష్ణ కూతురిని తన కొడుకు లోకేష్ కు చేసుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు మామ ఎన్టీఆర్ కు ఆత్మను శాంతింప చేయాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది. కానీ అవినీతి అంటే అసహ్యంచుకుంటూ ఎన్నో ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు కేవలం రక్త సంబంధం కోసం స్వర్గం నుంచి చంద్రబాబుని, కొడుకు బాలకృష్ణని ఆశీర్వదీస్తారా? సందేహమే!

"అరుంధతి" సినిమాని జనం బాగా చూస్తున్నారు కాబట్టి ఒక విషయం ఇక్కడ ప్రస్తావించాలి. తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన కుటుంబ సభ్యులను ఎన్టీఆర్ ఆత్మ వదిలిపెడుతుందా? ఆత్మకు రక్త సంబంధం ఉంటుందా? బాలకృష్ణ మరో నెల రోజుల వరకు సరిగా మాట్లాడలేని పరిస్ధితి ఎందుకు వచ్చింది? అవినీతి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మొండిగా రోడ్ల మీద స్నానం చేసి, సింపుల్ గా ఎన్నో రోజుల పాటు పర్యటించి, అనర్గళంగా ప్రసంగించి ప్రజల అభిమానం చవిచూసిన ఎన్టీఆర్ కు వీళ్ళు వారసులా? కాంగ్రెస్ నాయకులను కుక్కమూతి పిందెలుగా ఎన్టీఆర్ అభివర్ణించేవారు. ఇప్పుడు ఆయన సొంత తెలుగుదేశం పార్టీకి ఆ వ్యాఖ్యని వర్తింపజేస్తే ఆ పార్టీ ముఖ్యులు తల ఎక్కడ పెట్టుకుంటారు.

ఒక సదాశయం కోసం పార్టీని స్ధాపించిన ఎన్టీఆర్ ఆత్మ అరుంధతి సినిమాలో లాగా పనిచేస్తే చాలా మంది నోళ్ళు ఆగిపొవాలి. స్వార్ధ ప్రయోజనాలే పరమాధిగా ఉన్న రాజకీయాలకు తెరపడాలి. చంద్రబాబు నాయుడైనా, రాజశేఖరరెడ్డి అయినా అక్రమాలకు పాల్పడకుండా ప్రభుత్వాన్ని నడపలేదు. ఈ బాలకృష్ణను ఈ ఒక్క విషయం చెప్పమనండి "అవినీతి లేకుండా నా తండ్రిగారిలా ప్రభుత్వాన్ని నడిపిస్తానని". అటువంటి డైలాగ్ రావడానికి అతని గొంతు పనిచేస్తే కదా? హెరిటేజ్ కంపెనీ అక్రమాల మీద బాలయ్య ఎలా ప్రతిస్పందిస్తారు?
User Comments
telugu 05 Apr 2010 03:25 pm
editor....................................dont write abuse words against to balakrishna(roaring tiger) . ur not suppose to talk against him. be in ur limits.
ఎఱ్ఱగడ్డ డాక్టర్ 02 Apr 2010 08:54 am
సూపర్ సలహా బాస్ అర్జెంటుగా ఈ ఎడిటర్ గాడిని ఎఱ్ఱగడ్డ పంపించండి
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs