వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామానాయుడు ఆఫర్‌కు స్పందించని చిరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

chiranjeefi-ramanaidu
ప్రముఖ నిర్మాత రామానాయుడు తాను చిరంజీవితో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నానని బహిరంగంగా ప్రకటించినప్పటికీ చిరంజీవి ఏమాత్రం స్పందించలేదట. హరనాథ్ పోలిచెర్ల దర్శకత్వం వహించి హీరోగా నటించిన రాజేంద్ర చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి రామానాయుడు, చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ తాను చిరంజీవిని రాజా అని పిలుస్తుంటానని, మా రాజా డేట్లిస్తే సురేష్ ప్రొడక్షన్‌లో సినిమా తీస్తానని ఇంతకుముందే ఇక్కడే అడిగానని, మంచి కథ ఉంటే చేద్దామని ఆయన చెప్పారని అన్నారు. చిరును దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మంచి కథతో వస్తే సినిమా తీస్తామని చెప్పారు. ఒకవేళ చిరంజీవి మంత్రి అయినా సరే ప్రత్యేక అనుమతితో సినిమా తీస్తామని అందులో వచ్చే లాభాలను ట్రస్టుకు ఇస్తామని ప్రకటించారు.

అయితే ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి మాత్రం రామానాయుడు వ్యాఖ్యలకు స్పందించలేదు. కేవలం రాజేంద్ర సినిమా పైన మాత్రమే మాట్లాడారు. రాజేంద్రను అవయవదానం అంశంపై రూపొందించారని చెబుతూ ఒక వ్యక్తి చనిపోతూ అవయవ దానం చేస్తే తొమ్మిది మందికి జీవనం దానం చేసినట్లేనని చెప్పారు. కొన్నేళ్ల క్రితం రక్తదానం గురించి తెలిసినప్పుడు రక్త, నేతర దాన నిధి పెట్టానని వాటి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతుంటే ఆనందపడ్డానని చెప్పారు. అయితే రామానాయుడు ఆఫర్ గురించి మాత్రం మాట్లాడలేదు. అయితే అంతకుముందే మంచి కథ దొరికితే చేద్దామని తనతో చెప్పారని రామానాయుడు అన్నందువల్లే దానిపై ఇక స్పందించాల్సిన అవసరం లేదని చిరు అభిప్రాయపడ్డారో లేక సాధారణంగా మాట్లాడుకుంటూ వెళ్లారో కానీ ఆఫర్ పైన స్పందించక పోవడం వార్త అయింది.

English summary
Megastar Chiranjeevi did not responded on producer Ramanaidu's open offer yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X