హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ గుట్టు: నటి సైజా, మోడల్ నిషా

By Pratap
|
Google Oneindia TeluguNews

Drugs Mafia
హైదరాబాదులో మరోసారి డ్రగ్స్ మాఫియా లోగుట్టు బయటపడింది. ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న పప్పు అనే వ్యక్తిని పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. అతను వెల్లడించిన విషయాలు ఆశ్చర్యం గొలిపే విధంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రసారం చేసింది. డ్రగ్స్ వాడుతున్న కొంత మంది పేర్లను కూడా ఆ చానెల్ వెల్లడించింది. మోడల్ నిషా, తమిళ నటి సైజా డ్రగ్స్ వాడకందార్లలో ఉన్నట్లు తెలిపింది. అలాగే, ఫేషియల్ ఎక్స్‌పర్ట్ నవీన్‌కు కూడా పప్పు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడట. ప్రముఖ కార్ల విక్రయదారు కుమారుడు కూడా డ్రగ్స్ బానిస అయినట్లు చెబుతోంది. సెలిబ్రెటీ స్ఫూర్తి రెడ్డి కూడా ఆ జాబితాలో ఉన్నట్లు చానెల్ వెల్లడించింది.

డ్రగ్స్ వాడకందార్ల జాబితా తమ వద్ద ఉందని కూడా టీవీ చానెల్ చెప్పుకుంటోంది. మరో ఐదుగురు ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారని చెబుతూ వారి పేర్లను వెల్లడించలేదు. డ్రగ్స్ వాడకందార్లలో సెలిబ్రిటీలు, నటీనటులు, మోడల్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఓ హోటల్లో పనిచేసే పప్పు డబ్బులకు ఆశపడి ప్రముఖులకు డ్రగ్స్ అందించే పనిలో మునిగిపోయాడని, అతని వద్ద దాదాపు 15 మంది పనిచేస్తున్నారని తెలుస్తోంది. దాదాపు వంద మంది పూర్తిగా డ్రగ్స్‌కు బానిసలైనట్లు పప్పు వెల్లడించిన వివరాల ద్వారా తెలిసిందని అంటున్నారు. ప్రముఖ తమిళ నటులంతా డ్రగ్స్‌కు బానిసలేనని పోలీసులు చెప్పినట్లు ఆ చానెల్ తెలిపింది.

డ్రగ్స్ వ్యవహారంలో హీరో రవితేజ సోదరులు పట్టుబడ్డారు. ఆ తర్వాత జీవిత సోదరుడి వ్యవహారం కూడా బయటపడింది. క్రమంగా సినీ పరిశ్రమకు సంబంధించిన డ్రగ్స్ వ్యవహారం డొంక కదులుతూ వస్తోంది. అందరినీ తాము పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటే తప్ప కేసు నిలువదు. ఇది పోలీసులకు పెద్ద ఆటంకంగా మారింది. దీంతో డ్రగ్స్ వాడకందార్లను గుర్తించి వారికి పోలీసులు కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
According to a Telugu TV channel Tamil actress Saija and Model Nisha are using drugs. It said that Police arrested drugs supplier Pappu two days back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X