వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వాంటెడ్'కు 'జై బోలో తెలంగాణ' దెబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

Jai bholo Telangana
చాలా రోజుల తర్వాత వచ్చిన హీరో గోపీచంద్ సినిమాపై తెలంగాణ దెబ్బ పడుతోంది. బుధవారం విడుదలైన వాంటెడ్ సినిమా ప్రదర్శనను తెలంగాణవ్యాప్తంగా అడ్డుకుంటున్నారు. జై బోలో తెలంగాణ సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు కల్పిస్తుండడంపై తెలంగాణవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ విద్యార్థులు సీమాంధ్ర హీరోల సినిమాలను అడ్డుకుంటున్నారు. మంగళవారం రాత్రి నుంచి సీమాంధ్ర హీరోల సినిమాల ప్రదర్శనకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వరంగల్‌లో మంగళవారం రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పరమవీర చక్ర, గోల్కొండ హైస్కూల్, రగడ సినిమాల ప్రదర్శనలను నిలిపేసి, థియేటర్ల యజమానులు ప్రేక్షకులు తిరిగి డబ్బులు ఇచ్చేశారు.

బుధవారం ఆ ఆందోళన తెలంగాణవ్యాప్తంగా చోటు చేసుకుంది. వాంటెడ్ సినిమా ప్రదర్శనలకు పలు చోట్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. హైదరాబాదులోని నాచారాంలో వాంటెడ్ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లాలో వాంటెడ్ సినిమాతో పాటు ఇతర సినిమాల ప్రదర్సన కూడా నిలిపేశారు. గోదావరిఖనిలో వాంటెడ్ సినిమా ప్రదర్సనను అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఆదిలాబాద్‌లో గోల్కొండ స్కూల్ సినిమా రీళ్లను దగ్దం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో వాంటెడ్, గోల్కొండ సినిమాల రీళ్లను దహనం చేశారు. మెదక్ జిల్లా హుస్నాబాదులోనూ వాంటెడ్ సినిమా ప్రదర్సనను అడ్డుకున్నారు.

కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వాంటెడ్ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. నిజామాబాదు జిల్లాలోనూ వాంటెడ్ సినిమా ప్రదర్సనకు ఆటంకాలు ఏర్పడ్డాయి. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సెన్సార్ బోర్డు సభ్యుడు రాము ఇంటి ముందు తెలంగాణవాదులు ధర్నా చేశారు. జై బోలో తెలంగాణ సినిమాకు ఆటంకాలు కల్పిస్తే తాను రాజీనామా చేస్తానని రాము చెప్పారు. జై బోలో తెలంగాణ సినిమాకు ఇదే విధమైన ఆటంకాలు కల్పిస్తే సీమాంధ్ర హీరోల సినిమాల విషయంలో తాము కూడా అదే రీతిలో వ్యవహరించాల్సి ఉంటుందని సెన్సార్ బోర్డు మరో సభ్యుడు దశరథరామిరెడ్డి మంగళవారం అన్నారు.

జై బోలో తెలంగాణ సినిమాకు సంబంధించి అభ్యంతరాలేవీ చెప్పకుండా దాన్ని జాతీయ సెన్సార్ బోర్డుకు ప్రాంతీయ సెన్సార్ బోర్డు పంపింది. జాతీయ సెన్సార్ బోర్డు నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత ప్రాంతీయ సెన్సార్ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. దీంతో ఈ నెల 28వ తేదీన విడుదల కావాల్సిన జై బోలో తెలంగాణ సినిమాకు ఆటంకాలు ఏర్పడ్దాయి. విడుదలలో జాప్యం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X