కిరణ్‌కు వ్యతిరేకంగా బొత్స సైలెంట్ వర్క్?

శుక్రవారం, ఫిబ్రవరి 10, 2012, 11:34 [IST]
Botsa Satyanarayana
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుర్చీ కిందికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నీళ్లు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థులను బొత్స సత్యనారాయణ చేరదీసి మరో పవర్ సెంటర్‌గా ఆయన మారుతున్నట్లు చెబుతున్నారు. పిసిసి అధ్యక్షుడిగా అసమ్మతివాదులతో మాట్లాడి, వారిని సాధకబాధకాలు తెలుసుకోవడం తన బాధ్యతగా చెబుతూ కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ బలమైన లాబీనీ ఆయన తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిపై అసంతృప్తితో ఉన్న మంత్రులు, పార్టీ నాయకులు కూడా బొత్స సత్యనారాయణను కలుస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఎదుర్కునే దమ్మున్న నేతగా వారు బొత్స సత్యనారాయణను గుర్తిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే, కిరణ్ కుమార్ రెడ్డి అంటే గిట్టనివారంతా బొత్స పక్కన చేరుతున్నట్లు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. రాజీనామా చేయకుండా రవీంద్రా రెడ్డిని బుజ్జగించే పనిని ఆయన పెట్టుకున్నారు. రవీంద్రా రెడ్డి బొత్స సత్యనారాయణతో సమావేశమై తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ తన బాధ్యతను నిర్వహించారని బయటకు చెప్పే మాట. అయితే, దాని వెనక కిరణ్ కుమార్ రెడ్డిని బలహీనపరిచే వ్యూహం ఇమిడి ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై బొత్స సత్యనారాయణ కన్ను వేశారనేది కొత్త విషయమేమీ కాదు.

బొత్స సత్యనారాయణ తనపై విమర్శలు చేస్తున్నవారిని దగ్గరకు తీసుకుంటున్న క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవికి దగ్గరవుతున్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యవహారం నడుస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవి నివాసానికి వెళ్లి మంతనాలు జరిపారు. చిరంజీవిని తనతో కలుపుకుని వెళ్లడం ద్వారా బొత్స సత్యనారాయణ వ్యూహాన్ని దెబ్బ తీయాలని కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, కాంగ్రెసులో రెండు పవర్ సెంటర్లు ఉండడం కొత్తేమీ కాదు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పిసిసి అధ్యక్ష పదవి మొక్కుబడిగా మారింది. మిగతా అన్ని కాలాల్లోనూ పిసిసి అధ్యక్షుడికి, ముఖ్యమంత్రికి పడకపోవడం కాంగ్రెసు రాజకీయాల్లో మామూలు వ్యవహారమే.
English summary
It is said PCC president Botsa Satyanarayana is working silently against CM Kiran kumar Redd.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs