సభా సంఘం: వైయస్ జగన్‌కు మరో షాక్

గురువారం, ఫిబ్రవరి 9, 2012, 12:21 [IST]
YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై శాసనసభా స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభా సంఘాన్ని వేశారు. 15 మందితో ఆయన ఈ సభా సంఘాన్ని వేశారు. ఈ సభా సంఘం ఆరు నెలల్లో నివేదిక సమర్పిస్తుంది. ఇది వైయస్ జగన్‌కు ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే వైయస్ జగన్ పసిగట్టారు. అందుకే గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్రలో బుధవారం దానిపై స్పందించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులకే సభా సంఘం విచారణ పరిధిని పరిమితం చేయడం సరి కాదని ఆయన అన్నారు. నారా చంద్రబాబు నాయుడు, కె. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంల్లో జరిగిన భూకేటాయింపులపై విచారణను కూడా సభా సంఘం పరిధిలోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా కాంగ్రెసుకు చెందిన వి. హనుమంతరావు వంటివారు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్‌లకు) సేకరించిన భూములపై కూడా విచారణ జరగాలని వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ అంశం కూడా సభా సంఘం విచారణ పరిధిలోకి వస్తుంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపుల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు.

తన ఆస్తులపై, గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాలపై, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు వైయస్ జగన్‌కు ఇబ్బందికరమైన పరిస్థితినే కల్పిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నిర్ణయాలు, అక్రమ వ్యవహారాలు మొత్తం ఈ మూడు కేసుల దర్యాప్తులో బయటపడతాయని భావిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ ప్రయోజనం పొందారనే విమర్శ వినిపిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగి భూకేటాయింపుల వ్యవహారం కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డికి చుట్టుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని అంది పుచ్చుకుని రాజకీయాలు చేయాలని భావిస్తున్న వైయస్ జగన్‌ను దెబ్బకొట్టే వ్యూహం కూడా ఇందులో ఇమిడి ఉందని భావిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోని అవకతవకలను, అక్రమాలను బయటకు తేవడం ద్వారా ఆయన ఇమేజ్‌ను దెబ్బ తీయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. దానివల్ల వైయస్ జగన్ రాజకీయాలు దెబ్బ తింటాయని చెబుతున్నారు.
English summary
It is said that the constitution of House Committee to probe into allocation of lands in YSR regime may be a jolt to YSR Congress president YS Jagan.
User Comments
narsaraju 24 Feb 2012 05:54 pm
YSR CM ga vundaga Mantri vargam amodam to YSR teesu kunan nirnayalaki Jagan enduku badyudu avutadu..aite apapti Mantri mandali lo YSR pettina vaatiki amodam telipina mantrulu tappu chesinattu,guddiga YSR tappu chestunna amodam telipinanduku apapti mantri mandalia nat badyule..YSR chesina anni panulalo 99% mantri mandali amodam lekunda jaragavu..ante mantrulaki kuda mudupulu mutati ani kaaadaaaa? ekkado bayata vunna Jagan enduku donga avutadu..YSR donga aite apapti mantrulu andaru dongale
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs