మెగాఫోన్ పట్టనున్న కెసిఆర్: అన్నీ తానై సినిమా

ఆదివారం, ఫిబ్రవరి 12, 2012, 11:17 [IST]
K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మెగా ఫోన్ పట్టనున్నారని సమాచారం. ఇటీవల తెలంగాణ బతుకుపై సినిమాలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఆయనను ఏ సినిమా కూడా పూర్తిగా సంతృప్తి పరచలేదని సమాచారం. సకల జను సమ్మె సమయంలో వచ్చిన జై బోలో తెలంగాణ, పోరు తెలంగాణ, ఆ తర్వాత ఇంకెన్నాళ్లు, జై తెలంగాణ తదితర చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బతుకు చిత్రం కావడంతో కెసిఆర్ స్వయంగా ఓ చిత్రంలో గడబిడ జేస్తుండ్రు అనే పాట కూడా రాశారు. ఈ సినిమాలు అన్నింటిని చూసిన కెసిఆర్ దేనికీ పూర్తి మార్కులు వేయలేదంట. తెలంగాణ గాథను వారు తెరకెక్కించినందుకు ఆయన సంతోషిస్తున్నప్పటికీ టెక్నికల్ పరంగా ప్రజలను పూర్తిగా ఆకట్టుకోలేక పోయాయని ఆయన భావిస్తున్నారట. దీంతో ఆయనే స్వయంగా తెలంగాణపై ఓ చిత్రాన్ని అన్నీ తానై తీయాలని చూస్తున్నారని తెలుస్తోంది.

ఇందుకోసం ఆయన పలువురు సినీ ప్రముఖులతో టచ్‌లో ఉంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. తాను మెగా ఫోన్ పట్టుకొని తీసే ఈ చిత్రం 2014 ఎన్నికలకు ముందు విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారట. కేవలం తెలంగాణ పేరుతో ఆషామాషిగా తీస్తే హిట్ కావని, అందుకే నవరసాలు ఉండేలా తాను ఈ చిత్రాన్ని తీసి బిగ్ హిట్ కొట్టాలని కెసిఆర్ భావిస్తున్నారట. అన్నీ కుదిరితే త్వరలో ఆయన మెగా ఫోన్ పట్టబోయే చిత్రానికి ముహూర్తం షాట్ పడుతోందని అంటున్నారు.
English summary
It seems, TRS chief K Chandrasekhar Rao may direct one film on Telangana issue. He is planning to release this film before 2014 election.
User Comments
Narasimha Thota 14 Feb 2012 11:57 am
అవును మరి. ప్రేక్షకుడు కూడా KCR గాడె. USA లో మందు, నైట్ బార్స్ కు అలవాటు పడ్డ కవిత కూడా వీడి చెత్త సినిమా చూడదు.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs