రాజకీయాలకు సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంతర్గత శత్రువులను, ప్రత్యర్థులను ఎదుర్కుని పూర్తి ఆధిపత్యం సంపాదించడానికి అవసరమైన వ్యూహరచనను ఆయన వైయస్ రాజశేఖర రెడ్డి నుంచి అరువు తెచ్చుకున్నట్లు కనిపిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి పూర్తిగా సహకరించి, విధేయతను ప్రదర్శించినవారిలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక్కరు. శాసనసభ స్పీకర్‌గా వైయస్ రాజశేఖర రెడ్డికి ఆయన ఎంతో సహకరించారనే మాట వినిపిస్తూ ఉంటుంది. అందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి కాస్తా సాహసంగా అడుగు వేయడం మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి నుంచే నేర్చుకున్నట్లు కనిపిస్తున్నారు.
తనకు వ్యతిరేకంగా పనిచేస్తూ, తనకు సమాంతరంగా ఎదగాలనే నాయకులను ఎదుర్కోవడంలో, తెలంగాణ వంటి సమస్యల విషయంలో సీనియర్లనే కాకుండా ప్రతిపక్షాలను కట్టడి చేయడంలో వైయస్ రాజశేఖర రెడ్డి జూనియర్ల బ్యాచును ఓ దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి వ్యూహాన్ని ఆచరణలో పెట్టే సైన్యంగా అది తయారైంది. సీనియర్లను పక్కన పెట్టే సాహసం కూడా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రదర్శించారు. అదే సూత్రాన్ని కిరణ్ కుమార్ రెడ్డి పాటిస్తున్నట్లున్నారు. కొండ్రు మురళి, ప్రసాద్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మంత్రి పదవులు కట్టబెట్టే విషయంలో ఆయన దాన్నే ప్రదర్శించారు. అంతేకాకుండా పట్టు బట్టి తనవారికి మంత్రి పదవులు ఇప్పించుకోవడానికి పార్టీ అధిష్టానం వద్ద అంతే ఉడుం పట్టు పట్టారు. చివరకు తన కార్యాన్ని సాధించుకుని జూనియర్లలో మరింత విశ్వాసాన్ని పెంచుకున్నారు. తనను నమ్ముకున్నవారికి ఏదో రకంగా ప్రయోజనం చేకూరుతుందని, ఇప్పుడు కాకపోతే మరోసారైనా పదవులు దక్కుతాయని జూనియర్లకు నమ్మకం కలిగించగలిగారని అంటున్నారు.
ఆ రకంగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వంటి వారిని తగిన విధంగా ఎదుర్కోవడమే కాకుండా చిరంజీవి వంటివారు తన వైపు మళ్లేలా ఆయన వ్యవహరించారని చెప్పాల్సి ఉంటుంది. తనను వ్యతిరేకించేవారు ఎంతటివారైనా వారిని సహించబోననే సంకేతాలను కూడా అందించారు. పి. శంకరరావును మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు డిఎల్ రవీంద్రా రెడ్డి, దామోదర రాజనర్సింహ శాఖలను కత్తిరించడం దాకా ఆ పనే చేశారు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డి కూడా వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా బలోపేతం అవుతారా అనేది వేచి చూడాల్సిందే.