వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు, పవన్‌లతో బంధం: చేరికల ప్రక్రియ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతో బంధాన్ని పటిష్టపరుచుకుంటూనే తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్‌లోనూ బలం పెంచుకునే వ్యూహాన్ని బిజెపి జాతీయాధ్యక్షుడు అనుసరిస్తున్నట్లు అర్థమవుతోంది. గురువారం రాత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి అమిత్ షా శుక్రవారం ఉదయం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

చేరికలను, విలీనాలను ప్రోత్సహించడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌( టీఆర్‌ఎల్‌డీ) పార్టీ గురువారం బిజెపిలో విలీనమైంది. టీఆర్‌ఎల్‌డీ నేత, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ కుమార్‌, వివిధ జిల్లాల అధ్యక్షులు గురువారం అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టికెట్‌పై మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన మాజీ డిజిపి దినేష్ రెడ్డి కూడా బిజెపిలో చేరారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి)లో కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ డి.రాంబాబు, కాంగ్రెస్‌ కార్పొరేటర్ ‌(బేగంబజార్‌) శంకర్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ రాష్ట్రనేత సురేందర్‌, పద్మశాలి సంఘం నాయకురాలు అర్సనపల్లి సుజాత, పీఆర్‌పీలో ఇదివరకు పని చేసిన జి.లక్ష్మణ్‌, ఆప్‌ నాయకురాలు ఉండవల్లి ప్రమీల, ప్రముఖ ఆర్థోపెడిషీయన్‌ శివరామ్‌ నాయక్‌ అమిత్‌షా సమక్షంలో బిజెపిలో చేరారు.

ఈ చేరికలు మరింతగా ఊపందుకోవచ్చునని భావిస్తున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పాగా వేయాలని చూస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును దెబ్బ తీయాలనే ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

వ్యూహంలో భాగమే...

వ్యూహంలో భాగమే...

అమిత్ షా వ్యూహంలో భాగంగానే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఇటీవలి కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై మాటల యుద్ధాన్ని పెంచినట్లు చెబుతున్నారు. మజ్లీస్‌తో టిఆర్ఎస్ దోస్తీపై ఆయన విరుచుకుపడుతున్నారు.

తెలంగాణ సొంతిల్లు..

తెలంగాణ సొంతిల్లు..

తెలంగాణ తమకు సొంతిల్లు లాంటిదని అమిత్ షా సెంటిమెంట్ ప్రయోగం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తమ వల్లనే సాధ్యమైందని ఆయన చెప్పారు.

ఒక్కటే మాట..

ఒక్కటే మాట..

2019లో తెలంగాణలో కమలం జెండా ఎగరాలి. మనం అధికారంలోకి రావాలని అమిత్ షా పార్టీ కార్యకర్తలకు లక్ష్యాన్ని నిర్దేశించారు.

తొలిసారి తెలంగాణలో..

తొలిసారి తెలంగాణలో..

పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గురువారం తొలిసారిగా ఆయన తెలంగాణపై అడుగు పెట్టారు. బీజేపీని గడపగడపకూ తీసుకెళ్లాలని పిలుపునిస్తూనే తెరాస ప్రభుత్వం చేసే తప్పులపై ప్రతిపక్షంలా పోరాడాలని అమిత్ షా అన్నారు.

బిజెపి నేతలతో మంతనాలు

బిజెపి నేతలతో మంతనాలు

సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్స్‌(సెస్‌)లో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులతో అమిత్‌షా భేటీ అయ్యారు.

అభినందన సభ

అభినందన సభ

బిజెపి గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిటీ, రంగారెడ్డి జిల్లా (అర్బన్‌) కమిటీల ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలోనూ అమిత్ షా పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో..

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో..


వచ్చే ఎన్నికల్లో తూర్పు, దక్షిణ ప్రాంత రాష్ట్రాల్లో పార్టీకి లభించే ఆదరణతో అధికారంలోకి రానున్నామని, వాటిలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పాత్ర కీలకంగా మారుతుందని అమిత్ షా అన్నారు.

తెలంగాణ నాయకత్వం

తెలంగాణ నాయకత్వం

2019లో బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టడానికి తెలంగాణ నాయకత్వం వహించాల్సి ఉంటుందని అభినందన సభలో తెలిపారు.

కపిలవాయి దిలీప్ ఇలా...

కపిలవాయి దిలీప్ ఇలా...

తమ టిఆర్ఎల్డీ పార్టీని కపిలవాయి దిలీప్ కుమార్ బిజెపిలో విలీనం చేశారు. అమిత్ షా సమక్షంలో ఆయన కమలం కండువా కప్పుకున్నారు.

అమిత్ షాకు సన్మానం..

అమిత్ షాకు సన్మానం..

బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు హైదరాబాదులో ఘన స్వాగతం మాత్రమే కాకుండా ఘన సత్కారం కూడా జరిగింది.

దత్తాత్రేయ గుసగుస...

దత్తాత్రేయ గుసగుస...

బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పార్టీ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ వేదిక మీదనే గుసగుసలు పెట్టారు.

బిజెపిలోకి ఇలా..

బిజెపిలోకి ఇలా..

బిజెపిలోకి వచ్చిన ఓ మహిళా నేతకు అభివాదం చేస్తూ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇలా కనిపించారు.

English summary
BJP national president Amit Shah is giving proirity to Andhra Pradesh CM Nara Chandrababu Niadu and Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X