మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిగ్గీ ముందే.. కుర్చీ విసిరేసి వెళ్లిన విహెచ్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏఐసిసి నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఎదుటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి కారణాలపై విశ్లేషించుకొని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈనెల 23, 24 తేదీల్లో (ఆది, సోమవారాల్లో) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పార్టీ నేతల సమావేశాన్ని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఏర్పాటు చేశారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు దిగ్విజయ్ సింగ్ శనివారమే నగరానికి చేరుకున్నారు. మేధోమథనం సదస్సుకు అజెండా ఖరారు చేసే విషయమై ఆయన గాంధీ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. సమావేశంలో పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతుండగా ఏఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు జోక్యం చేసుకుని మేధోమథనం కంటే ముందుగా పార్టీ కార్యకర్తలతో వర్క్ షాప్ నిర్వహించాలన్నారు.

అప్పుడే కిందిస్థాయిలో ఏమి జరుగుతున్నదో, పార్టీ ఎందుకు బలహీనంగా ఉందో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయంటూ చెప్పడానికి యత్నించారు. కాగా మల్లు రవి ప్రసంగించడం పూర్తైన తర్వాతే మీరు మాట్లాడాలని, మధ్యలో జోక్యం చేసుకోవడం తగదని దిగ్విజయ్ సింగ్... విహెచ్‌ను వారించారట. దీంతో విహెచ్ కొంత అసహానానికి గురై తను కూర్చున్న కుర్చీని ఆగ్రహంతో గిరాటేశారు. తీవ్ర ఆగ్రహంతో సమావేశం నుంచి బయటకు వచ్చేశారు.

వి హనుమంత రావు

వి హనుమంత రావు

ఏమిటీ? వాకౌటా? అని విలేకరులు విహెచ్‌ను ప్రశ్నించగా... పార్టీ కార్యకర్తల మనోభావాలు, వాస్తవాలు తెలుసుకోకుండా మేధోమథనం నిర్వహించి ఏం చేస్తారని ప్రశ్నించారు. పార్టీకి అండగా ఉండే కార్యకర్తలతో వర్క్‌షాప్ నిర్వహించాలని తాను ఎన్నికల ముందు చెప్పానని, కనీసం ఇప్పుడైనా నిర్వహించాలని చెబిటే పట్టించుకోనందుకే తాను వచ్చేశానన్నారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

ఇలా ఉండగా సమావేశంలో దిగ్విజయ్ స్పందిస్తూ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని అనుకున్నామని, అయితే అనివార్య కారణాల వల్ల నిర్వహించలేకపోయినట్టు చెప్పారు.

 టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

తర్వాత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలు అంటూ మొదలు పెట్టారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

కాగా పలువురు నాయకులు కల్పించుకుని మీ కుమార్తె స్రవంతి రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంగతేమిటీ? అంటూ ప్రశ్నించారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

అందుకు పాల్వాయి కొంత సీరియస్‌గానే ప్రతిస్పందించారు. తన కుమార్తెకు అసెంబ్లీకి పోటీ చేసేందుకు అన్నీ అర్హతలు ఉన్నందున టిక్కెట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరినా పట్టించుకోలేదని, దీంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారని, ప్రజాస్వామ్యంలో ఆమెకు ఉన్న హక్కును తాను కాదనలేనని పాల్వాయి వివరించారట.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా పార్టీ ఓడిపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమయ్యామని తెలిపారు.

 టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

పార్టీ నేతలు పలువురు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ప్రకటించకపోవడం, ఎన్నికల ప్రణాళికను ప్రకటించడంలో విపరీతమైన జాప్యం చేయడం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సక్రమంగా జరగకపోవడం, తెరాస తరహాలో ప్రజలకు ఆకర్షణీయమైన పథకాల గురించి చెప్పకపోవడం వంటి కారణాలను ప్రస్తావించారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

పార్టీ నేతలు కలహాలు మానాలని, కలిసి పని చేయాలని ఏఐసిసి నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ తెలంగాణ నేతలకు సూచించారు.

 టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

ఏఐసిసి నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఎదుటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

 టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి కారణాలపై విశ్లేషించుకొని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈనెల 23, 24 తేదీల్లో (ఆది, సోమవారాల్లో) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పార్టీ నేతల సమావేశాన్ని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఏర్పాటు చేశారు.

 టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు దిగ్విజయ్ సింగ్ శనివారమే నగరానికి చేరుకున్నారు. మేధోమథనం సదస్సుకు అజెండా ఖరారు చేసే విషయమై ఆయన గాంధీ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు.

టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్

సమావేశంలో పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతుండగా ఏఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు జోక్యం చేసుకుని మేధోమథనం కంటే ముందుగా పార్టీ కార్యకర్తలతో వర్క్ షాప్ నిర్వహించాలన్నారు.

English summary
Telangana Congress is organising a two-day workshop from Sunday for the party men to prepare an action plan for rejuvenating the party in the region, amidst high dissidence, groupism and lack of unity within the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X