టాక్ ఆఫ్ టుడే
బొత్స సేఫ్, ఎమ్మార్ పాపం ఐఎఎస్లదేఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి, ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సేఫ్‌గా ఉన్నారు. సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ ఆయన ఏ తప్పు చేయలేదని తెలియజేస్తోంది. అందుకే బొత్స సత్యనారాయణ అప్పటి మంత్రి వర్గం బాధ్యత గురించి కూడా కచ్చితంగానే మాట్లాడుతున్నారు. ఎమ్మార్ కుంభకోణంలో బొత్స సత్యనారాయణ ఏ విధమైన
కిరణ్‌కు వ్యతిరేకంగా బొత్స సైలెంట్ వర్క్?ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుర్చీ కిందికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నీళ్లు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థులను బొత్స సత్యనారాయణ చేరదీసి మరో పవర్ సెంటర్‌గా ఆయన మారుతున్నట్లు చెబుతున్నారు. పిసిసి అధ్యక్షుడిగా అసమ్మతివాదులతో మాట్లాడి, వారిని సాధకబాధకాలు తెలుసుకోవడం తన బాధ్యతగా చెబుతూ కిరణ్ కుమార్ రెడ్డికి
సభా సంఘం: వైయస్ జగన్‌కు మరో షాక్వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై శాసనసభా స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభా సంఘాన్ని వేశారు. 15 మందితో ఆయన ఈ సభా సంఘాన్ని వేశారు. ఈ సభా సంఘం ఆరు నెలల్లో నివేదిక సమర్పిస్తుంది. ఇది
ల్యాన్స్ ఆర్మ్‌స్ట్రాంగే యువరాజ్‌కు స్ఫూర్తిక్యాన్సర్తో బాధపడుతున్న యువరాజ్ సింగ్ మనోధైర్యాన్ని కూడగట్టుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన ఆరోగ్యం రోజు రోజుకూ మెరుగుపడుతోందని ఆయన ట్విట్టర్‌లో రాశాడు. యువరాజ్ సింగ్ క్యాన్యర్ వ్యాధికి అమెరికాలో చికిత్స పొందుతున్నాడు. యువరాజ్ సింగ్‌కు వచ్చిన క్యాన్సర్ నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. కొంత మేరకు ఇది ఊరట కలిగించే విషయమే. పంజాబ్‌కు చెందిన యువరాజ్ సింగ్ తన
వైయస్సార్‌ను ఫాలో అవుతున్న కిరణ్ కుమార్ రెడ్డిరాజకీయాలకు సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంతర్గత శత్రువులను, ప్రత్యర్థులను ఎదుర్కుని పూర్తి ఆధిపత్యం సంపాదించడానికి అవసరమైన వ్యూహరచనను ఆయన వైయస్ రాజశేఖర రెడ్డి నుంచి అరువు తెచ్చుకున్నట్లు కనిపిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి పూర్తిగా సహకరించి, విధేయతను ప్రదర్శించినవారిలో కిరణ్
తెలం'గానం': సిఎంపై రూటుమార్చిన బొత్సప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రూటు మార్చారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బొత్స పిసిసి చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారని, అయితే ఆయన ఇప్పుడు తన పదవిని 2014 వరకు రక్షించుకునే పనిలోనే ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బొత్సకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్
ఐఏఎస్‌ల వెనుక జగన్, మాజీ సలహాదారు?రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కావొచ్చుననే అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. సిబిఐ దర్యాఫ్తును తప్పు పడుతూ రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. శనివారం వారు మీడియాతో కూడా మాట్లాడుతూ, సిబిఐ తీరును ఎండగట్టారు.
లోకసత్తా జెపి వ్యాఖ్యలతో చిక్కుల్లో ఐఎఎస్లుమాజీ ఐఎఎస్ అధికారి, లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలు రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారులను చిక్కుల్లో పడేస్తున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్, ఎమ్మార్ కుంభకోణం, వైయస్ జగన్ ఆస్తుల కేసులను విచారిస్తున్న సిబిఐపై ఐఎఎస్ అధికారులు మండిపడుతున్నారు. ఐఎఎస్ అధికారులను సిబిఐ వేధిస్తోందని వారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు.
సిబిఐపై ఐఎఎస్ అధికారుల మండిపాటుమూడు ఉన్నత స్థాయి కేసుల్లో సిబిఐ వ్యవహరిస్తున్న తీరుపై ఐఎఎస్ అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. సిబిఐ మంత్రులను వదిలేసి ఐఎఎస్ అధికారులను వేధించే పనికి పూనుకుందని వారు గుర్రుమంటున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్, ఎమ్మార్ కుంభకోణం, వైయస్ జగన్ ఆస్తుల కేసుల్లో సిబిఐ ఐఎఎస్
ఎమ్మార్‌లోనూ జగన్ ఇరుక్కుంటారా?ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసు దర్యాప్తు విషయంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సిబిఐపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఎమ్మార్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే దోషి అని, సిబిఐ చంద్రబాబును వదిలేస్తోందని వారు విమర్శిస్తున్నారు. అలాగే, స్టైలిష్ హోమ్ డైరెక్టర్ తుమ్మల రంగారావును అరెస్టు చేయకపోవడాన్ని కూడా