హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సర్వే షురూ: బోసిబోయిన హైదరాబాద్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉదయం సమగ్ర కటుంబ సర్వే ప్రారంభమైంది. హైదరాబాదులో ఉదయం 7 గంటలకు సర్వే ప్రారంభం కాగా, జిల్లాల్లో 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాల్లో రాత్రి 8 గంటల వరకు, హైదరాబాదులో రాత్రి 7 గంటల వరకు సర్వే కొనసాగుతుంది.

తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే కారణంగా హైదరాబాద్ నగరం బోసిబోయింది. సమగ్ర సర్వే కోసం ప్రజలు ఇళ్లలోనే ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తమ సొంత గ్రామాల్లో మాత్రమే వివరాలను నమోదు చేసుకోవాలని భావించిన ప్రజలు హైదరాబాద్ వదిలిపెట్టారు.

ప్రజలు పల్లెబాట పట్టడంతో హైదరాబాదులో రద్దీ లేకుండా పోయింది. హైదరాబాదులోని సినిమా హాళ్లు, దుకాణాలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాదులో ఆర్టీసి బస్సులు ఆగిపోయాయి. హైదరాబాద్ రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

కుటుంబ సర్వే

కుటుంబ సర్వే

మున్సిపల్ కమిషనర్ సోమేష్‌కుమార్ తన కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్లకు అందించారు. సర్వేకు అందరూ సహకరిస్తున్నట్లు తెలిపారు.

కుటుంబ సర్వే

కుటుంబ సర్వే

ఉపాధి కోసం నగరానికి వచ్చిన పల్లెజనం మూటాముల్లె సర్దుకుని గ్రామాల బాట పట్టారు. దీంతో బస్సు స్టేషన్లు సోమవారం రద్దీగా మారిపోయాయి. మంగళవారం హైదరాబాద్ ఖాళీగా కనిపించింది.

కుటుంబ సర్వే

కుటుంబ సర్వే

హైదరాబాదు నుంచి గ్రామాలకు తరలివెళ్లే ప్రజలతో రైల్వే స్టేషన్లు కూడా క్రిక్కిరిసిపోయాయి. రైళ్లలోనూ వేలాడే పరిస్థితి ఉంది. దీంతో హైదరాబాద్ మంగళవారంనాడు బోసిబోయింది.

కుటుంబ సర్వే

కుటుంబ సర్వే

రైల్వే స్టేషన్లలో సోమవారంనాడు కూడా పల్లెకు తరలిపోతున్న ప్రజలతో ఇసుక వేస్తే రాలనంత జనం పోగయ్యారు. వారు తమ పేర్లను గ్రామాల్లో నమోదు చేయించుకోవడానికి పల్లెబాట పట్టారు.

కుటుంబ సర్వే

కుటుంబ సర్వే

మూటాముల్లెలు సర్దుకుని హైదరాబాద్ ఉపాధి కోసం వచ్చిన ప్రజలు తమ స్వగ్రామాలు చేరుకోవాడనికి రైళ్లను, బస్సులను ఆశ్రయించారు. దీంతో హైదరాబాద్ మంగళవారంనాడు బోసిబోయింది.

కుటుంబ సర్వే

కుటుంబ సర్వే

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గ్రామాలకు వెళ్లే ప్రజలతో క్రిక్కిరిసిపోయింది. హైదరాబాద్, సికింద్రబాద్ బస్ స్టేషన్లు సోమవారం రద్దీగా మారాయి.

English summary
Intensive household survey has begun in Telangana state today. Curfew like situation prevailed in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X