వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌కు ప్రేమ్‌జీ హామీ, కేటీఆర్ చేయి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ఐటీ, హార్డ్‌వేర్ రంగాల్లో మరిన్ని పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, ద్వితీయ శ్రేణి నగరాల పైన దృష్టి సారిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు.

ముఖ్యంగా హైదరాబాద్‌లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రేమ్‌జీ ప్రకటించారు. కేసీఆర్‌తో ఆదివారం సమావేశమైన సందర్భంగా ప్రేమ్‌జీ ఈ విషయం చెప్పినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్‌లో ఇప్పటికే ఐటీ క్యాంపస్‌లు నిర్వహిస్తున్న విప్రో సంస్థ కార్యకలాపాలు.. నగరంతో తనకున్న అనుబంధాన్ని ప్రేమ్‌జీ కేసీఆర్‌తో పంచుకున్నారని ప్రకటనలో వివరించింది.

ప్రేమ్‌జీకి కేసీఆర్ పుష్పగుచ్ఛం

ప్రేమ్‌జీకి కేసీఆర్ పుష్పగుచ్ఛం

తెలంగాణ రాష్ట్రం సాధించటంతోపాటు తొలి సీఎం పదవి చేపట్టినందుకు కేసీఆర్‌ను ప్రేమ్‌జీ అభినందించారని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తీసుకురానున్న మార్పులను ప్రేమ్‌జీకి కేసీఆర్‌ వివరించారు.

కేసీఆర్, ప్రేమ్‌జీ

కేసీఆర్, ప్రేమ్‌జీ

జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అత్యంత అనుకూల ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రం గుర్తింపు పొందే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేసీఆర్‌ అన్నారు.

కేసీఆర్, ప్రేమ్‌జీ

కేసీఆర్, ప్రేమ్‌జీ

త్వరలోనే పారిశ్రామికవేత్తలకు సకల సౌకర్యాలు కల్పించేలా, అత్యంత పారదర్శకమైన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనున్నామని కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్, ప్రేమ్‌జీ

కేసీఆర్, ప్రేమ్‌జీ

అవినీతిరహిత సింగిల్‌ విండో విధానం అమల్లోకి రానుందని, తన కార్యాలయంలోనే ఛేజింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేయనున్నామని కేసీఆర్ వివరించారు.

కేసీఆర్, ప్రేమ్‌జీ

కేసీఆర్, ప్రేమ్‌జీ

ఐటీ రంగంలో హైదరాబాద్‌ భారతదేశానికే తలమానికంగా అయ్యేలా కృషి చేస్తున్నామని, అలాగే హైదరాబాద్‌ను 4జీ వైఫై నగరంగా తీర్చిదిద్దనున్నామని, ప్రతిష్ఠాత్మక ఐటీఐఆర్‌ ప్రాజెక్టును పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్, ప్రేమ్‌జీ

కేసీఆర్, ప్రేమ్‌జీ

తెలంగాణలో మరిన్ని ఐటీ పార్కులు రావటానికి చర్యలు తీసుకుంటున్నామని, ఐటీ, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేయనున్నామని కేసీఆర్ తెలిపారు.

కేటీఆర్ కరచాలనం

కేటీఆర్ కరచాలనం

త్వరలోనే నూతన పారిశ్రామిక విధానానికి తుదిరూపు ఇస్తామని.. ఆ తర్వాత మరోసారి విప్రోతో కలిసి పని చేసే అంశాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

హరీష్ రావు కరచాలనం

హరీష్ రావు కరచాలనం

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్‌, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

English summary
Wipro chairman Azim Premji met Telangana and Andhra Pradesh chief ministers on Sunday and discussed his company's expansion plans in both the states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X