వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ సింగపూర్ టూర్ ఇలా హిట్.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తొలి విదేశీ పర్యటనను ముగించుకని ఆదివారం అర్ధరాత్రి హైదరాబాదుకు తిరిగి వచ్చారు. ఐదు రోజుల సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చారు. ఐఐఎం పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న నూతన పారిశ్రామిక విధానాన్ని సింగపూర్‌లో పారిశ్రామికవేత్తలకు వివరించారు.

అక్కడ అమలు చేస్తోన్న ప్రపంచంలోనే ఉత్తమైన పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే సింగపూర్‌లో ప్రభుత్వం అమలు చేస్తోన్న శాంతి భద్రతలు, రవాణా వ్యవస్థ తదితర అంశాలను పరిశీలించారు. రాజధాని మలేసియాకు కారులో ప్రయాణించి అక్కడ శాటిలైట్ టౌన్‌షిప్‌లను పరిశీలించారు. మలేసియాలో ఆదివారం ఉదయం ప్రధాని కార్యాలయ భవనాన్ని, అక్కడి మోనో రైలు సౌకర్యాన్ని పరిశీలించారు.

హైదరాబాద్ నగరాన్ని రెండు కోట్లమంది జనాభాకు సరిపడే విధంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థకు అప్పగించాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. సింగపూర్, మలేసియా నగరాలను అభివృద్ధి పరిచిన ప్రణాళికలను ముఖ్యమంత్రి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు సింగపూర్ పర్యటన దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

కేసీఆర్

కేసీఆర్

సిఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కేసీఆర్ జరిపిన విదేశీ పర్యటన విజయవంతమైనట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

కేసీఆర్

కేసీఆర్

మలేషియాలోని సన్‌వేల‌గున్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ గనుల తవ్వకంతో ఏర్పడిన ప్రాంతంలో నిర్మించిన ఆధునాతన షాపింగ్ మాల్, రిసార్టులను చూశారు.

కేసీఆర్

కేసీఆర్

మలేషియా ప్రభుత్వం అధికారిక కార్యకలాపాల నిర్వహణకు పుత్రజయ నగరంలో ఏర్పాటు చేసిన అతిపెద్దకార్యాలయ సముదాయాన్ని, అక్కడి ఉద్యోగుల పని తీరును కేసీఆర్ గమనించారు.

కేసీఆర్

కేసీఆర్

కేసీఆర్ తన పర్యటనలో కౌలాలంపూర్, పుత్రజయ నగరాలను సందర్శించారు. మలేషియా ప్రభుత్వం నడుపుతున్న మోనో రైలు ప్రాజెక్టు పని తీరును అడిగి తెలుసుకున్నారు.

కేసీఆర్

కేసీఆర్

కేసీఆర్ తన పర్యటనలో కౌలాలంపూర్, పుత్రజయ నగరాలను సందర్శించారు. మలేషియా ప్రభుత్వం నడుపుతున్న మోనో రైలు ప్రాజెక్టు పని తీరును అడిగి తెలుసుకున్నారు.

కేసీఆర్

కేసీఆర్

పుత్రజయలోని ప్రభుత్వం భవనాల సముదాయాన్ని రూ.40వేల కోట్లతో నిర్మించినట్లు అక్కడి అధికారులు కేసీఆర్‌కు వివరించారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఆర్థిక సాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు మలేషియాలోని తెలంగాణ వారు సన్మానం చేశారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఆర్థిక సాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు మలేషియాలోని తెలంగాణ వారు సన్మానం చేశారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఆర్థిక సాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు మలేషియాలోని తెలంగాణ వారు సన్మానం చేశారు. వారితో కలిసి ఫోటోలు దిగారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సింగపూర్ పర్యటన ముగించుకొని ఆదివారం రాత్రి హైదరాబాదుకు చేరుకున్నారు.

 కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సింగపూర్ పర్యటన ముగించుకొని ఆదివారం రాత్రి హైదరాబాదుకు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికిన శ్రీనివాస్ గౌడ్ తదితరులు.

English summary
Photos: KCR reaches Hyderabad on Sunday night
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X