వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయ్‌పూర్, ప్చ్: బాబు రాజధాని కల (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలక్ట్రానిక్ మీడియా ఎడిటర్లతో మంగళవారంనాడు సమావేశమై వివిధ విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కొత్త రాజధాని నిర్మాణం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రముఖుల విగ్రహాల ప్రతిష్టాపన వరకు మనసు విప్పి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తాను కంటున్న కలను ఆయన ఎడిటర్లకు వివరించారు. చత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయపూర్‌పై ఆయన పెదవి విరిచారు.

ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఒక నూతన రాజధానిని నిర్మించుకొనే అవకాశం మాకు వచ్చిందని, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దానిని నిర్మించి వేల సంవత్సరాలపాటు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చూడాలన్నది తన తపన అని చంద్రబాబు చెప్పారు.
భవిష్యత్‌ తరాల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా కూడా అది నిలవాలని ఆయన అన్నారు టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన సమయంలో దానిని ఒక మురికివాడల నగరంగా నిర్మించలేమని, అది మంచి సామాజిక జీవితానికి ప్రతిబింబంగా ఉండాలని ఆయన అన్నారు.

నయా రాయ్‌పూర్‌లో సామాజిక జీవితం లేదని ఆయన అన్నారు. కేవలం ఉద్యోగాలు చేసుకొనేందుకు అక్కడికెళ్లి తిరిగి వచ్చేస్తున్నారని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కడుతున్నారని, ఆ పరిస్ధితి ఇక్కడ కొత్త రాజధానిలో రానివ్వమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

ఎలక్ట్రానిక్ మీడియా ఎడిటర్లతో బాబు

ఎలక్ట్రానిక్ మీడియా ఎడిటర్లతో బాబు

అక్టోబర్‌ 2 నుంచి జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మంగళవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో ఆయన ఎలకా్ట్రనిక్‌ మీడియా సంపాదకులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాజధాని నిర్మాణంపై తమకు ఉన్న ఆలోచనల దృష్ట్యా కొంత ఎక్కువ భూమి అవసర ముంటుందని అంచనా వేస్తున్నామని, అయితే నిర్ధిష్టంగా ఇన్ని వేల ఎకరాలు కావాలని ఇంకా ఏ అంచనాకూ రాలేదని ఆయన చెప్పారు.

నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను..

నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తానే బ్రాండ్‌ అంబాసిడర్‌నని, మరొకరు అవసరం లేదని చంద్రబాబు చమత్కరించారు. తాను అభివృద్ధి చేయగలనని, ఇక్కడ స్నేహపూరిత వాతావరణం ఉంటుందని, తనతో ఎవరికీ ఏ సమస్యలూ రావని అందరికీ నమ్మకం, విశ్వాసం ఉన్నాయని ఆయన అన్నారు.

జన్మభూమిపై చంద్రబాబు

జన్మభూమిపై చంద్రబాబు

జన్మ భూమి కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మగంళవారంనాడు సమీక్ష జరిపారు.

జన్మభూమిపై చంద్రబాబు

జన్మభూమిపై చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు.

English summary
Nara Chandrababu Naidu, Hon'ble Chief Minister of Andhra Pradesh is seen in the "Electronic Media Editors" Meeting at Lake View Guest House, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X