వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని: కర్నూలుపై బాబు విముఖత (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కర్నూలుకు వరాల వర్షం కురిపించడం ద్వారా తాను అనుకున్న చోటున రాజధానిని ఏర్పాటు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కర్నూలును ఎపి రాజధానిగా చేయాలనే డిమాండ్ పలు వైపుల నుంచీ వస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలును పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజనపై ఆయన ఆదివారం శ్వేత పత్రం విడుదల చేశారు.

కర్నూలును రాజధాని చేయకపోతే ప్రత్యేక సీమ రాష్ట్రం ఇవ్వాలంటున్నారన్న ప్రశ్నకు చంద్రబాబు స్పందించారు. అలా అయితే జిల్లాకో రాష్ట్రం ఏర్పాటు చేయాలని, కర్నూలుకు తానచ్చిన ప్యాకేజీని గతంలో ఎవ్వరూ ఇవ్వలేదని చెప్పారు. అభివృద్ధి కావాల్నో, రాజకీయాలు కావాల్నో ప్రజలే తేల్చుకోవాలని ఆయన ఆందోళనకారులను హెచ్చరించారు కూడా. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడు తున్న నేతలు ఇన్నేళ్లుగా కర్నూలు కోసం ఏంచేశారో చెప్పాలని అన్నారు.

కర్నూలులో నీరు, ఖనిజ సంపద, సహజవనరులున్నాయని, కర్నూలులో 30వేల ఎకరాలలో పారిశ్రా మిక సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దాన్ని కర్నూలుతో కలుపుతామని, ప్రత్యేకంగా విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కర్నూలును అగ్రగామిగా నిలబెడతామని, అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని అన్నారు.

రాజధాని సమస్యే..

రాజధాని సమస్యే..

రాజధాని లేకుండా విభజన చేశారని, రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలో కూడా సూచించలేదని, ఇప్పుడు ప్రజల్లో అపోహలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు.

రాజధాని సమస్య

రాజధాని సమస్య

నిపుణుల కమిటీ అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తోందని, దీంతో ప్రతి ఒక్కరిలో ఆశలు కలుగుతున్నాయని, తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని కోరుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.

రాజధాని సమస్య..

రాజధాని సమస్య..

కలిసి ఉండాల్సిన జనం మధ్య ఈ అంశం విభేదాలకు అవకాశం కల్పించేలా రాజధాని సమస్య తయారైందని, దీనికి కాంగ్రెస్సే కారణమని చంద్రబాబు అన్నారు.

రాజధాని సమస్య

రాజధాని సమస్య

అయితే, 10 ఏళ్లు హైదరాబాదులో ఉండటానికి అవకాశం కల్పించారని, రాజధాని ఎక్కడ? మార్పు ఎప్పుడు? అనేది తాను, ప్రభుత్వం ఆలోచించుకుంటామని, ప్రస్తుతం లేక్‌వ్యూలో ఉంటున్నానని, అది అతిథి గృహమని చంద్రబాబు అన్నారు.

రాజధాని సమస్య

రాజధాని సమస్య

రేపటి రోజు విజయవాడకో, విశాఖపట్టణానికో వెళితే మరో గెస్ట్‌హౌస్‌లోనే ఉండాలి కదా అని, లేదంటే అద్దె ఇంట్లో ఉండాలని,త సమయం, అవకాశాన్నిబట్టి నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు.

రాజధాని సమస్య

రాజధాని సమస్య

తనకు రాజధాని విషయంలో స్వార్థం లేదని, స్వార్థం ఉంటే మా ఊర్లోనే తిరుపతి దగ్గర కళ్యాణి డ్యామ్‌ పక్కనే రాజధాని పెట్టుకోవాలి. ఎప్పుడైనా న్యాయానికి కట్టుబడి ఉండాలని, ప్రజలు ఓటేసింది స్వార్థంతో ఉండాలని కాదని చంద్రబాబు అన్నారు.

రాజధాని సమస్య

రాజధాని సమస్య

విద్వేషాలు, సమస్యలు, అడ్డగోలు విభజనవల్ల హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటోందని, ఫలితంగా తెలంగాణ ప్రజలే కాదు...హైదరాబాద్‌ ప్రజలూ నష్టపోతున్నారని చంద్రబాబు అన్నారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu rejected the demand of Kurnool as AP capital
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X