నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూతురు కల్వకుంట్ల కవిత కోసం కెసిఆర్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: బలమైన కాంగ్రెసు అభ్యర్థి మధుయాష్కీపై పోటీ పడుతున్న తన కూతురు కల్వకుంట్ల కవిత కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు. నిజామాబాద్ లోకసభ స్థానంలో కవిత మధుయాష్కీపై, బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణపై పోటీ పడుతున్నారు.

మంగళవారంనాడు కెసిఆర్ నిజామాబాద్ బహిరంగ సభలో కాంగ్రెసు తెలంగాణ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసుపై దాడిని ఆయన పెంచారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణను నాగసాకిలాగానే తయారు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవితకు కెసిఆర్ నిజామాబాద్ పార్లమెంటు సీటు ఇచ్చారు. దాంతో నిజామాబాద్‌లో తన కూతురు కవిత విజయం కూడా కెసిఆర్‌కు ప్రతిష్టాత్మకంగానే మారింది.

నిజామాబాద్‌లో కెసిఆర్

నిజామాబాద్‌లో కెసిఆర్

తెలంగాణలోని నిజామాబాద్ లోకసభ స్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు శంఖారావం నిర్వహించారు.

కెసిఆర్ ఇలా...

కెసిఆర్ ఇలా...

నిజామాబాద్ శంఖారావం సభకు వస్తూ కెసిఆర్ ఇలా కనిపించారు. ఆయన సభలో కాంగ్రెసు నాయకులపై విరుచుకుపడ్డారు.

నమస్కారం పెడుతూ..

నమస్కారం పెడుతూ..

తెలంగాణ ఛాంపియన్‌గా నిలవాలనే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉన్నారు.

సాంస్కృతిక ప్రదర్శన

సాంస్కృతిక ప్రదర్శన

కెసిఆర్ బహిరంగ సభ సందర్భంగా నిజామాబాద్‌లో కళాకారులు సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చారు. తమ ప్రదర్శనతో వారు అదరగొట్టారు.

వేదిక మీంచి దండం పెడుతూ..

వేదిక మీంచి దండం పెడుతూ..

నిజామాబాద్ బహిరంగ సభకు తరలి వచ్చిన ప్రజలకు వేదిక మీది నుంచి దండం పెడుతూ కెసిఆర్ ఇలా కనిపించారు.

దమ్ముంటే చర్చకు రావాలని...

దమ్ముంటే చర్చకు రావాలని...

తెలంగాణ సీమాంధ్ర ఆధిపత్యంలో ఎలా విధ్వంసమైందో చర్చంచడానికి ముందుకు రావాలని కెసిఆర్ పొన్నాల లక్ష్మయ్యకు సవాల్ విసిరారు.

కెసిఆర్ వేషధారి ఇలా...

కెసిఆర్ వేషధారి ఇలా...

నిజామాబాద్ కెసిఆర్ బహిరంగ సభలో అచ్చం కెసిఆర్‌ను తలపిస్తూ ఓ వ్యక్తి ఇలా కూర్చుని చేయి పైకెత్తాడు.

English summary
Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao is bidding for his daughter and Telangana Jagruthi president Kalwakuntla Kavitha's victory at Nizamambad Lok Sabha seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X