హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వానలో చార్మినార్ వద్ద 'విదేశీ' సరదా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిషా తీరాన్ని ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బటపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రాగల 48 గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా హైదరాబాద్‌లో శుక్రవారం వర్షాలు పడ్డాయి. శనివారం కూడా ముసురు పడుతూనే ఉంది. ఎండకు మాడిపోతున్న ప్రజలకు ఇది హాయిని ఇచ్చింది. హైదరాబాదులోని చార్మినార్ వద్ద విదేశీయులు వానలో చిందులేశారు.

విదేశీయుల సరదా

విదేశీయుల సరదా

వానకాలం కూడా ఎండాకాలాన్ని తలపిస్తూ ఎండలు మండిపోతున్న తరుణంలో వర్షాలతో హైదరాబాదు చల్లబడింది. ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ విదేశీయులు చార్మినార్ వద్ద గొడుగులు పట్టుకుని ఇలా...

విదేశీయుల సరదా

విదేశీయుల సరదా

వానతో వాతావరణం చల్లబడిన నేపథ్యంలో చారిత్రక ప్రదేశం చార్మినార్ వద్ద విదేశీయులు గొడుగులు తలపై పెట్టుకుని చల్లదనాన్ని ఆస్వాదించారు.

విదేశీయుల సరదా...

విదేశీయుల సరదా...

వాతావరణం చల్లగా హాయినిస్తుంటే విదేశీయులు చార్మినార్ వద్ద ఫొటోలకు ఫోజులు ఇస్తూ ఆనందంగా గడిపారు.

విదేశీయుల సరదా..

విదేశీయుల సరదా..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల హైదరాబాదులో చినుకులు పడ్డాయి. ఈ చల్లదనంలో విదేశీయులు చార్మినార్ వద్ద ఇలా ఆనందించారు.

English summary
Foreigners enjoyed the rain at Charminar in Hyderabad. Telangana and Andhra Pradesh are witnessing rains with the depression Bay of Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X