వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీని జగన్ ఉరకలెత్తించగలరా? (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవలి కాలంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన జిల్లాల్లో నియోజకవర్గాలవారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారంనాడు అనంతపురం జిల్లా సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు నూతన కమిటీలను నియమించారు. కమిటీల నియామకం పూర్తి కావడంతో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డినియోపకవర్గాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.

తెలంగాణలోనూ నియోజకవర్గాల సమీక్షకు సైతం జగన్‌ శ్రీకారం చుట్టే అవకాశముందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల కొత్త కమిటీలను నియమించడంతో పాటు కొత్త వ్యక్తులను బాధ్యతలను అప్పగించి పార్టీని బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నిక ల తర్వాత పార్టీకి క్యాడర్‌ దూరమవుతున్న నేపథ్యంలో జగన్‌ ఈ మేరకు చర్యలు తీసు కుంటున్నట్లు సమాచారం.

పార్టీ బలోపేతానికి నియోజకవర్గాలవారీ సమీక్షా సమావేశాల్లో సలహాలను, సూచనలను కూడా జగన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని ఎండగట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాంపై కూడా చర్చిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారికి దగ్గర కావాలని ఈ సందర్భంగా జగన్‌ సూచిస్తున్నట్లు సమాచారం.

అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ పెద్దలపై కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసి ప్రజల సమస్యలను పోరాటాలు చేయాలని విజ్ఞప్తి చేస్తు న్నారు. దీనివల్ల పార్టీకి మంచి పేరు రావడంతో పాటు పార్టీకి పటిష్టత కూడా పెరుగుతుందనే శ్రేణులకు జగన్‌ దిశానిర్ధేశం చేస్తున్నారు.

జగన్ సమీక్ష

జగన్ సమీక్ష

అనంతపురంలో ఆ జిల్లా నాయకులకు నియోజకవర్గాల వారీ సమీక్షా సమావేశంలో వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను వివరించే ప్రయత్నాలు చేశారు.

మీడియాపై ధ్వజం

మీడియాపై ధ్వజం

గత ఎన్నికల్లో ఓ వర్గం మీడియా అబద్ధాలు ప్రచారం చేయడం వల్ల, తెలుగదుేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అబద్ధాలకు వంత పాడడం వల్ల తమ పార్టీ ఓడిపోయిందని ఆయన విశ్లేషించారు.

జగన్ సమీక్షా సమావేశం

జగన్ సమీక్షా సమావేశం

అనంతపురం జిల్లా నియోజకవర్గాలవారీ సమీక్షా సమావేశంలో పార్టీ నాయకులను కార్యాచరణకు పురికొల్పేందుకు ప్రయత్నించారు.

రెండో రోజు సమీక్ష

రెండో రోజు సమీక్ష

వైయస్ జగన్ ఆషామాషీగా కాకుండా సుదీర్ఘంగా పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాల్లో నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.

English summary
YSRCP president YS Jagan Mohan Reddy holding Assembly constituency wise review meeting of Ananthapuram dist in Ananthapuram
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X