విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘మేడిన్ ఆంధ్రా’తో ముందుకు: బాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐటి రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విశాఖలో దేశవిదేశాల ఐటి కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల (సిఇఓ)తో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు. మేక్ ఇన్ ఇండియా ప్రధాని మోడీ నినాదం అయితే, మేడ్ ఇన్ ఆంధ్ర తన నినాదమని అన్నారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఎంతో మమకారం ఉన్న తను కూడా ఐటిని కోస్తాతీరం నుంచి అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు చంద్రబాబు చెప్పారు. వివిధ దేశాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో చాలామంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారేనని గుర్తు చేశారు. ఇక్కడ చదువుకుని, తమ తెలివితేటల్ని విదేశాల్లో ఉపయోగిస్తున్నారని, కానీ ఇక్కడే చదువుకుని, ఇక్కడే తమ తెలివితేటలకు పదును పెట్టేందుకు అవకాశాలు కల్పిస్తామని, అందుకే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకు కదులుతున్నామని చంద్రబాబు చెప్పారు.

ఐటి రంగంలో సిలికాన్ వ్యాలీకి ఎంతో ప్రాధాన్యత ఉందని, ఆ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌ను సిలికాన్ కారిడార్‌గా రూపొందిస్తానని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళా కంప్యూటర్ వినియోగించే స్థాయికి తీసుకువెళ్తామని, రాష్ట్రంలో 17 లక్షల డ్వాక్రా సంఘాలు ఆన్‌లైన్ ద్వారా తమ కార్యకలాపాలు సాగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చే మూడు నాలుగేళ్లలో ప్రతి కుటుంబం నుంచి ఒక కంప్యూటర్ విద్య అభ్యసించిన వారిని, ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.

గతంలో తను ముఖ్యమంత్రి అయిన తరువాత హైదరాబాను ఐటి హబ్‌గా తయారు చేయడానికి తొమ్మిదేళ్లు పట్టిందని, ఇప్పుడు మూడు నాలుగేళ్లలోనే ఆంధ్రాను ఐటి హబ్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. త్వరితగతి నిర్ణయాలు, అవినీతిరహిత పాలనతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకువస్తానని ఆయన చెప్పారు.ఇప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు. అందువల్ల పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ వెనకాడవద్దని ఆయన పిలుపునిచ్చారు.

యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు పబ్లిక్, ప్రయివేట్ పార్ట్నర్‌షిప్ ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే ప్రతి ఇంటికీ హై స్పీడ్ బ్యాండ్ విడ్త్ కలిగిన ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నామని చంద్రబాబు చెప్పారు. విశాఖ నగరం తన హృదాయానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. విశాఖను ఐటి హబ్‌గా రూపుదిద్దాలన్న తన చిరకాల వాంఛ నెరవేరబోతోందని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐటి రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

సోమవారం విశాఖలో దేశవిదేశాల ఐటి కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల (సిఇఓ)తో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు.

చంద్రబాబు

చంద్రబాబు

మేక్ ఇన్ ఇండియా ప్రధాని మోడీ నినాదం అయితే, మేడ్ ఇన్ ఆంధ్ర తన నినాదమని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఎంతో మమకారం ఉన్న తను కూడా ఐటిని కోస్తాతీరం నుంచి అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

వివిధ దేశాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో చాలామంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారేనని గుర్తు చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఇక్కడ చదువుకుని, తమ తెలివితేటల్ని విదేశాల్లో ఉపయోగిస్తున్నారని, కానీ ఇక్కడే చదువుకుని, ఇక్కడే తమ తెలివితేటలకు పదును పెట్టేందుకు అవకాశాలు కల్పిస్తామని, అందుకే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకు కదులుతున్నామని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఐటి రంగంలో సిలికాన్ వ్యాలీకి ఎంతో ప్రాధాన్యత ఉందని, ఆ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌ను సిలికాన్ కారిడార్‌గా రూపొందిస్తానని ప్రకటించారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతి మహిళా కంప్యూటర్ వినియోగించే స్థాయికి తీసుకువెళ్తామని, రాష్ట్రంలో 17 లక్షల డ్వాక్రా సంఘాలు ఆన్‌లైన్ ద్వారా తమ కార్యకలాపాలు సాగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

వచ్చే మూడు నాలుగేళ్లలో ప్రతి కుటుంబం నుంచి ఒక కంప్యూటర్ విద్య అభ్యసించిన వారిని, ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.

English summary
The Andhra Pradesh government has decided to construct 'Signature Tower', better than Hyderabad's Hitech City, in Visakhapatnam to attract a large number of IT companies, said chief minister N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X