వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురంధేశ్వరికి టిడిపి ఎంట్రీ: బాబుతో రాయబారాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు దంపతుల తెలుగుదేశం ఎంట్రీకి పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో రాయబారాలు నడుస్తున్నట్లు వినికిడి. చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలకు సన్నిహితులైన అమెరికాలోని కుటుంబ సభ్యులు మధ్యవర్తిత్వం నెరుపుతున్నట్లు సమాచారం. చంద్రబాబు కుటుంబంతో దగ్గుబాటి కుటుంబ సభ్యుల రాజీకి ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీలోకి రావటానికి దగ్గుబాటి వెంకటేశ్వరావు సుముఖంగా ఉన్నారని సమాచారం. అయితే టిడిపి అధినేత మాత్రం వారిని పార్టీలోకి చేర్చుకొనే విషయంలో మౌనం పాటిస్తున్నారు. గత దశాబ్దంన్నర కాలం నుంచి చంద్రబాబుతో ఎడమొగం, పెడమొగంగా ఉంటున్న దగ్గుబాటి వుంకటేశ్వరావు క్రమంగా మనసు మార్చుకొంటున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చినప్పటికీ, పార్టీలో చర్చించి ఒక నిర్ణయానికి రావాలనే యోచనలో చంద్రబాబు వున్నారని సమాచారం.

Purandheswari entry: NRI family members mediate

రాష్ర్ట విభజన వల్ల దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్‌కు దూరం అయ్యారు. తర్వాత పురందేశ్వరి భారతీయ జనతా పార్టీలో చేరి కడప జిల్లా రాజంపేట నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. నిజానికి, పురందేశ్వరి ఈ ఎన్నికల్లో విజయం సాధించినట్లైతే ఆమెకు కేంద్ర మంత్రి పదవి దక్కేది. ఓటమి తర్వాత పురంధేశ్వరి గత కొన్ని రోజులుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు.
రాజకీయంగా చంద్రబాబుతో విభేదాలు ఉండటంతో ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులంతా జరుపుకొనే వేడుకలలో తప్ప మరెక్కడా వీరు కలుసుకోవటంలేదు. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన తరువాత దగ్గుబాటి దంపతుల మనసులో మార్పు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య అమెరికాలో పురందేశ్వరి మాతృసంస్థలోకి వెళ్ళటానికి తనకు అభ్యంతరం లేదని తన మనస్సులో మాట బయటపెట్టారు.

పురందేశ్వరి మాటలను బట్టి టీడీపీలో చేరటానికి అనుకూలంగా ఉన్నా, అది ఏవిధంగా సాధ్యమనేది స్పష్టం కావటంలేదు. చంద్రబాబు వారిని పార్టీలో చేర్చుకుంటారా అనేది సంశయంగానే ఉంది. ఎన్టీఆర్ వారసత్వానికి తాను వారసుడిగా వచ్చి, ఆ తర్వాత తన కుమారుడు నారా లోకేష్‌ను ముందుకు తీసుకురావాలని చంద్రబాబు అనుకుంటున్నారు. దీంతో దగ్గుబాటి దంపతులను చేర్చుకుంటే పార్టీలో సమీకరణాలు మారి తన వ్యూహానికి విఘాతం కలిగే ప్రమాదం ఉంటుందా అనే కోణంలో చంద్రబాబు ఆలోచించే అవకాశాలున్నాయని అంటున్నారు.

English summary
It is said that NRI family members mediating to wipe out differences between Daggubati Purandheswari couple and Andhra Pradesh CM and Telugudesam party president Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X