వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాసకు మెట్రో చిక్కు: ఎర్రబెల్లితో కేసీఆర్ స్కెచ్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసన సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు రెండు రోజుల క్రితం అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారనే ప్రచారం పైన విస్తృత చర్చ సాగుతోంది. ఎర్రబెల్లి కలిశారా? అర్ధరాత్రి ఎందుకు కలవాల్సి వచ్చింది? మెట్రో అంశంపై టీటీడీపీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు ఎందుకు? చంద్రబాబు ఎర్రబెల్లిని పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారా? అనే చర్చ సాగుతోంది.

అదే సమయంలో.. తమ ప్రభుత్వం పైన తెలంగాణ టీడీపీ పొలిటికల్ గేమ్‌కు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా కేసీఆర్ పలువురు తెలంగాణ టీడీపీ నేతలను ప్రయోగిస్తున్నారా అనే చర్చ సాగుతోంది. మెట్రో పైన టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వానికి బహిరంగ సవాళ్లు విసురుతున్నారు. అఖిలపక్షం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇది కేసీఆర్‌ను, తెరాసను ఇబ్బందులకు గురి చేస్తోందని అంటున్నారు.

దీంతో కేసీఆర్ టీడీపీ ఎత్తులను చిత్తు చేసేందుకు స్కెచ్ వేశారని అంటున్నారు. మెట్రో పైన టీడీపీలోనే కొందరు విభేదిస్తే, ఆ పార్టీలోని కొందరిని ఇలాంటి సమయంలో చేర్చుకుంటే ఆ పార్టీని నైతికంగా దెబ్బతీసినట్లవుతుందని కేసీఆర్ స్కెచ్ వేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. మెట్రో పైన టీడీపీలోనే కొందరు విభేదిస్తే అది ఆ పార్టీకి అననుకూలంగా, తెరాసకు అనుకూలంగా మారుతుందని కేసీఆర్, తెరాస భావిస్తోందని అంటున్నారు.

కేసీఆర్‌తో ఎర్రబెల్లి అర్ధరాత్రి కలిసిన విషయం ఎలా లీక్ అయిందనే చర్చ కూడా జరుగుతోందని చెబుతున్నారు. ఎర్రబెల్లికి, రేవంత్‌కి మైహోం విషయంలోనే చెడిందనే ఊహాగానాలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి పార్టీని వీడుతారా? బాబు వద్ద ఎర్రబెల్లికి ప్రాధాన్యం తగ్గి రేవంత్‌కి పెరిగిందా? ఎర్రబెల్లి పార్టీలోనే ఉంటే చంద్రబాబు తిరిగి ఆయనకు తొలి ప్రాధాన్యం ఇస్తారా? అనే చర్చ సాగుతోంది.

 ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అర్ధరాత్రి కలిశారనే ప్రచారం టీడీపీలో కలకలం రేపుతోంది.

 కేసీఆర్

కేసీఆర్

మెట్రో పైన తెలంగాణ టీడీపీ నేతల వ్యాఖ్యలతో కేసీఆర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంతో ఆ పార్టీని నైతికంగా దెబ్బతీసేందుకు కేసీఆర్ స్కెచ్‌లో భాగంగానే ఎర్రబెల్లి కలిశారని అంటున్నారు.

 రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా మెట్రో అంశంపై తెరాస ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇది తెరాసను ఇబ్బందులకు గురి చేస్తోందని అంటున్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఎర్రబెల్లి పార్టీని వీడుతారా? బాబు వద్ద ఎర్రబెల్లికి ప్రాధాన్యం తగ్గి రేవంత్‌కి పెరిగిందా? ఎర్రబెల్లి పార్టీలోనే ఉంటే చంద్రబాబు తిరిగి ఆయనకు తొలి ప్రాధాన్యం ఇస్తారా? అనే చర్చ సాగుతోంది.

English summary
Telugudesam Telangana leader Errabelli Dayakar Rao met Telangana CM and Telangana Rastra Samithi president K Chandrasekhar Rao sunday midnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X