విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్‌తో పొట్లూరి కటీఫ్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rift between PVP and Pawan Kalyan
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మిత్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్‌ల మధ్య విభేదాలు వచ్చాయా? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయవాడ లోకసభ స్థానం గురించే వీరిద్దరి మధ్య పొరపొచ్చలు వచ్చాయంటున్నారు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపన వెనుక పొట్లూరి వర ప్రసాద్ ప్రధానంగా ఉన్నారనే ప్రచారం అప్పుడు జోరుగా సాగింది. విజయవాడ లోకసభ స్థానం కోసమే పొట్లూరి పవన్‌తో పార్టీ పెట్టించారనే కామెంట్స్ కూడా వినిపించాయి.

పవన్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసు వ్యతిరేక ఓట్లను చీల్చవద్దనే ఉద్దేశ్యంతో పోటీ నుండి తప్పుకోవడమే కాకుండా.. బిజెపికి మద్దతు పలికారు. బిజెపితో టిడిపి జతకట్టినందున ఆ పార్టీకి కూడా పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. విజయవాడ లోకసభ స్థానం కోసం పివిపి పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. స్వయంగా పవన్ కూడా టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో టిక్కెట్ విషయమై అడిగినట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే, చంద్రబాబు.. పవన్ ప్రతిపాదనను పక్కన పెట్టి మొదటి నుండి అనుకున్న అభ్యర్థి కేశినేని నానికే ఇచ్చారు. దీనిని జీర్ణించుకోలేని పొట్లూరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోగి దిగాలని భావించి.. పవన్ మద్దతు కోరారు. దానికి పవన్ సున్నితంగా నో చెప్పినట్లుగా ప్రచారం జరిగింది.

ఈ అంశం ఇరువురి మధ్య పొరపొచ్చలు వచ్చేలా చేసిందంటున్నారు. రెండుమూడు రోజులుగా పివిపి, పవన్‌లు దూరం దూరంగా ఉంటున్నారట! పివిపి పారిశ్రామికవేత్తనే కాకుండా సినీ నిర్మాత కూడా. ఈ నేపథ్యంలో ఆయన పవన్‌తో వచ్చే ఏడాది ఓ భారీ సినిమా తీయాలని భావించారట. ఇప్పుడు విభేదాల కారణంగా ఆ సినిమాకు అవకాశం లేకపోవచ్చునని అంటున్నారు. పవన్ తనకు మద్దతివ్వనందున పివిపి ఆసక్తిగా లేనట్లుగా కథనాలు వస్తున్నాయి.

English summary
Pawan Kalyan and Potluri Vara Prasad (PVP) have apparently had a fall out over the elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X