కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేవరగట్టు రక్తసిక్తం: తొక్కిసలాట, ఒకరి మృతి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా బన్ని ఉత్సవం మళ్లీ రక్తసిక్తమైంది. సుమారు 70 మంది భక్తులకు గాయాలయ్యాయి. భక్తుల తొక్కిసలాటలో మహేష్ అనే పదకొండేళ్ల బాలుడు మృతి చెందాడు.

భక్తులు పరస్పరం రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో కొట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని టియర్ గ్యాస్ ప్రయోగించారు.

కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని దేవరగట్టులో దసరా సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన బన్ని ఉత్సవం మొదలైంది. బన్నీ ఉత్సవాన్ని తిలకించి దేవరగట్టు మల్లయ్యను దర్శించుకునేందుకు సుమారు రెండు లక్షల మంది భక్తులు తరలివచ్చారు.

 దేవరగట్టు

దేవరగట్టు

అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్థులు ఊరేగింపుగా దేవరగట్టుకు సమీపంలోని డోళ్లబండ వద్దకు చేరుకుని పాలబాసులు చేశారు.

దేవరగట్టు

దేవరగట్టు

12.30 గంటల ప్రాంతంలో ఆలయ పూజారి వచ్చి ఎస్పీ రవికృష్ణకు పసుపు బండారం, జమ్మిపత్రి ఇచ్చి ఊరేగింపునకు అనుమతి కోరారు. అంతలోనే పెద్దఎత్తున బాణసంచా పేల్చారు. గ్రామస్థులు కేకలు వేస్తూ కట్టెలు, ఆయుధాలతో పసుపు, బండారం చల్లుకుంటూ 800 అడుగుల ఎత్తులో ఉన్న కొండపైకి చేరుకున్నారు.

 దేవరగట్టు

దేవరగట్టు

మాళమల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా రాక్షస పడ, జమ్మిచెట్టు వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఉత్సవమూర్తుల దగ్గరకు ఇతర గ్రామస్థులు రాకుండా డివిటీలు విసురుతూ, అడ్డువచ్చిన వారిని కర్రలతో కొడుతూ ముందుకు సాగారు. ఇలా కర్రలతో కొట్టినపుడు పలువురు భక్తుల తలలు పగిలాయి. కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.

 దేవరగట్టు

దేవరగట్టు

సుమారు 70 మంది వరకు గాయపడ్డారు. ఇలా దెబ్బలు తగిలిన వారు అక్కడే ఉన్న వైద్యశిబిరంలో వైద్యం చేయించుకుని మళ్లీ బన్ని ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొనడం కనిపించింది.

 దేవరగట్టు

దేవరగట్టు

ఉత్సవం కొనసాగుతుండగానే కర్రలతో స్వామివారికి రక్షణగా ఓ బృందం అదుపుతప్పి భక్తులపై పడడంతో అక్కడే ఉన్న నెరణికి చెందిన బాలుడు మహేష్ ఊపిరాడక అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే బాలుడికి అక్కడే ఉన్న శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం ఆలూరు ఆసుపత్రికి తరలిచంగా అక్కడ మృతి చెందాడు.

 దేవరగట్టు

దేవరగట్టు

అనంతరం రాక్షసపడ వద్ద గొరవయ్య దబ్బనంతో తొడలో గుచ్చుకుని రక్తం తీసి భూమిని తడిపాడు. జమ్మిచెట్టు వద్ద పూజలు చేసిన అనంతరం తిరిగి దేవాలయం ప్రాంగణం చేరేసరికి తెల్లవారింది.

 దేవరగట్టు

దేవరగట్టు

అనంతరం విగ్రహాలను శివసానకట్ట వద్దకు తీసుకొచ్చి పూజలు చేశారు. ఈ క్రమంలో సులువాయి, అరికెర, బిలేహాల్ గ్రామాల ప్రజలు, నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్థుల మధ్య ఘర్షణ జరిగింది.

 దేవరగట్టు

దేవరగట్టు

ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో పరస్పర దాడులకు దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. వెంటనే ఎస్పీ సిబ్బందితో రంగంలో దిగి టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

 దేవరగట్టు

దేవరగట్టు

ఎస్పీ రవికృష్ణ, డిఎస్‌పి శివరామిరెడ్డి దేవరగట్టులోనే రాత్రంతా మకాం వేసినా ఫలితం లేకుండా పోయింది. కర్రలతో పెద్దమొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పటికీ భక్తుల చేతుల్లో దివిటీలు, కర్రలు కనిపించడం గమనార్హం.

English summary
A Eleven year old boy has lost life at Davaragattiu Karralasamu in Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X