మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైలు ప్రమాదం: డ్రైవర్ సహా 16 మంది విద్యార్థుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

మెదక్: తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసెంజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ సహా 16 మంది విద్యార్థులు మరణించినట్లు సమాచారం. ప్రమాదంలో డ్రైవర్ బిక్షపతి కూడా మరణించాడు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్సులో ఇస్లాంపూర్, గనేపల్లి, వెంకటాయపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

గురువారం ఉదయం గం.8.30 నిమిషాలకు ఈ ప్రమాదం సంభవించింది. రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సును రైలు కిలోమీటరు మేర లాక్కెళ్లింది. సంఘటనా స్థలం వద్ద పరిస్థితి ఘోరంగా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో పరిస్థితి హృదయవిదాకరంగా ఉంది. తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి విద్యార్థులతో మాదాపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Passenger train collides school bus, 25 feared dead

బస్సులో 38 మందికిపైగానే ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే క్రాసింగ్ వద్ద కాపలా లేకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆయన మంత్రులను ఆదేశించారు. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జయింది. సైరన్ ఇవ్వకపోవడం రైలు వస్తున్న విషయాన్ని బస్సు డ్రైవర్ గుర్తించలేదని అంటున్నారు. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు లేదు. గేటు పెట్టాలని స్థానికులు పలు మార్లు కోరినా ఎవరూ పట్టించుకోలేదు.

క్షతగాత్రులను బాలాజీ ఆస్పత్రికి తరలించారు. వారిని మెరుగైన వైద్యం కోసం యశోదా ఆస్పత్రికి తరలిస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రభుత్వ ఖర్చుతోనే వారికి వైద్యం అందిస్తామని ఆయన చెప్పారు. ప్రమాదంపై కెసిఆర్ విచారణకు ఆదేశించారు. ఘటనాస్థలానికి రైల్వే శాఖ ప్రత్యేక బృందాన్ని పంపించింది.

ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సంఘటనా స్థలానికి వైద్యులను, ఉన్నతాధికారులను పంపించింది. ప్రమాదంపై రైల్వే మంత్రి సదానంద గౌడ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స%E

English summary
25 students feared dead, as Nanded - Secendurabad passenger rail collided with kakatiya vidyalayam school bus at Masapet of Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X