వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్నుకాశీకి గంగామాత పిల్చింది: మోడీ, కేజ్రీ పైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

వారణాసి: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసిలో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం వారణాసి చేరుకున్న మోడీ ముందుగా మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇచ్చారు. బిజెపి నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. వారణాసిని తాను ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తనను గంగామాత కాశీకి రమ్మని పిలిచిందని వ్యాఖ్యానించారు. తనకు వారణాసి ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని మోడీ చెప్పారు. తనను ఇక్కడకు రప్పించిన గంగామాత ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు.

Video: Narendra Modi files nomination from Varanasi

అరవింద్ కేజ్రీవాల్ వద్ద మూడు కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ తాను పకీర్‌నని చెప్పడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. వారణాసిని ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మోడీ నామస్మరణంతో వారణాసి మారుమోగింది. వారణాసిలోని రోడ్లు బిజెపి కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/xem97AQ_gqE?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Modi finally spoke to the media at the collector's office. He said, I want to serve this land. I want to serve the weavers here. May Kashi emerge as spiritual capital."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X