twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: మనసు మార్చుకున్న నందూ.. రహస్యంగా ప్రేమ్ దగ్గరకు వెళ్లిన తులసి

    |

    ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అప్పులు చేసి డబ్బులు నాశనం చేశాడన్న కారణంతో బాబూరావును అతడి భార్య పిచ్చకొట్టుడు కొడుతుంది. దీంతో శృతి, ప్రేమ్ ఆమెను ఆపుతారు. ఆ తర్వాత ఆమె మాటలను గుర్తు చేసుకుంటూ ప్రేమ్ బాధ పడతాడు. అప్పుడే రాములమ్మ వాళ్ల ఇంటికి వస్తుంది. అప్పుడామెతో ఆటో నడుపుతానని చెబుతాడు. మరోవైపు, దివ్యకు అంకిత క్లాస్ పీకుతుంది. కానీ, ఆమె మాత్రం ఆ మాటలు వినదు. ఇక, తులసి తన బాధను అత్తగారికి చెప్పుకుంటుంది. దీంతో నందూను ఇంట్లో నుంచి పంపించేద్దాం అని అనసూయ చెబుతుంది.

    డోస్ పెంచేసిన సీరియల్ హీరోయిన్: బీచ్‌లో చిన్న క్లాత్‌తో కొత్త పెళ్లికూతురు రచ్చడోస్ పెంచేసిన సీరియల్ హీరోయిన్: బీచ్‌లో చిన్న క్లాత్‌తో కొత్త పెళ్లికూతురు రచ్చ

    మనసు మార్చుకున్నానన్న నందూ

    మనసు మార్చుకున్నానన్న నందూ

    వేరే ఇంట్లో శృతితో కలిసి పుట్టినరోజు జరుపుకున్న ప్రేమ్.. గత సంవత్సరం ఎలా సెలెబ్రేట్ చేసుకున్నాడో గుర్తు చేసుకుంటాడు. ఇంట్లో వాళ్లంతా అతడికి తెలియకుండా పుట్టినరోజు సర్‌ప్రైజ్ చేయాలని అనుకుంటారు. అంతలో తులసి వచ్చి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటుంది.

    అప్పుడు నందూ వచ్చి ఏమైందని అడగ్గా.. రేపు ఏంటో గుర్తుందా అని ప్రశ్నిస్తుంది. దీనికతడు ప్రేమ్ పుట్టినరోజు అని చెబుతాడు. దీనికి తులసి షాక్ అవుతుంది. అప్పుడు నందూ 'ప్రేమ పంచాలన్నా.. ప్రేమను చేరుకోవాలన్న పెద్ద పెద్ద త్యాగాలు చేయనవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే చాలని నిర్ణయించుకున్నా' అంటాడు.

    ఎవరికీ గుర్తు లేదని బాధ పడ్డ ప్రేమ్

    ఎవరికీ గుర్తు లేదని బాధ పడ్డ ప్రేమ్

    ప్రేమ్ పుట్టినరోజు అని తెలిసినా.. అనుకున్న సమయానికే అతడిని విష్ చేయాలని అందరూ ప్లాన్ చేసుకుంటారు. అప్పుడే ప్రేమ్ ఇంటికి వస్తాడు. కానీ ఇల్లంతా బొసిపోయి ఉంటుంది. అసలు ఎవ్వరూ తన బర్త్ డే గురించి పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తారు. శృతి కూడా నిద్రపోతున్నట్టు నటిస్తుంది. దీంతో ప్రేమ్‌కు చిరాకు వస్తుంది.

    అప్పుడు అతడు 'చివరకు నేను పెళ్లి చేసుకున్న భార్య కూడా నన్ను.. నా పుట్టినరోజును పట్టించుకోలేదంటే నేను వేస్ట్ క్యాండిడేట్ అని అందరూ ఫిక్స్ అయినట్టున్నారు' అని అనుకుంటాడు. ఆ తర్వాత సోఫాలో ఒంటరిగానే పడుకుంటాడు.

    శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ ట్రీట్: ఎద అందాలు పూర్తిగా కనిపించేంత ఘోరంగా!శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ ట్రీట్: ఎద అందాలు పూర్తిగా కనిపించేంత ఘోరంగా!

    సర్‌ప్రైజ్ చేస్తారని అనుకుంటాడు

    సర్‌ప్రైజ్ చేస్తారని అనుకుంటాడు

    ఎవరూ కనిపించకపోవడంతో ప్రేమ్ 'ఇంట్లో వాళ్లంతా 12 అయ్యే వరకూ వెయిట్ చేస్తుంటారేమో. ఇంకో రెండు నిమిషాల్లో టైం అవుతుంది. దీంతో వాళ్లంతా వచ్చి నాకు సర్ ప్రైజ్ ఇస్తారేమో.. కానీ, నేనే వాళ్లకు సర్‌ప్రైజ్ ఇస్తా' అని అనుకుంటాడు. కానీ, 12 అయినా కూడా ఎవ్వరూ రారు. దీంతో ప్రేమ్ చాలా బాధపడతాడు. అప్పుడు 'అందరూ నా బర్త్‌డే మరిచిపోయినట్టున్నారు. అమ్మ కూడా మరిచిపోయిందా.

    పోనీ నేనే వెళ్లి అమ్మ కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే.. వద్దులే అమ్మ ప్రేమ గురించి ఎలా తెలుసుకోవాలి. అందరూ మరిచిపోయినా నాకు నేనే బర్త్ డే విషెస్ చెప్పుకుంటా' అని హ్యాపీ బర్త్‌డే ప్రేమ్ అని చెప్పుకొని నిద్రపోతాడు.

    ప్రేమ్ దగ్గరకు తులసి.. చెప్పకుండా

    ప్రేమ్ దగ్గరకు తులసి.. చెప్పకుండా

    ప్రేమ్ అలా నిద్రపోతాడు. ఆ తర్వాత తులసి అతడి దగ్గరికి వెళ్లి అతడి తల మీద చేయి వేయబోయి ఆగిపోతుంది. అలాగే నిల్చుని పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్న అంటుంది. 'నువ్వు అన్నది నిజంరా. నేను ఊపిరి తీసుకోవడం అయినా మరిచిపోతానేమో కానీ నీ పుట్టిన రోజును ఎప్పటికీ మరిచిపోను. నన్ను క్షమించరా.

    ఇంట్లో వాళ్లు అందరూ నన్ను కట్టేశారు. అర్ధరాత్రి నిన్ను దీవించడానికి వెళ్లొద్దు అన్నారు. ఏమీ అనుకోకు. కొద్ది గంటలు ఆగితే అందరితో పాటు నేను కూడా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతాను' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

    Bigg Boss Non Stop: షోలో అసభ్యకరమైన సీన్.. పూల్‌లో వాళ్లిద్దరి సరసాలు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిBigg Boss Non Stop: షోలో అసభ్యకరమైన సీన్.. పూల్‌లో వాళ్లిద్దరి సరసాలు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి

    ప్రేమ్ చిరాకు చూసి సంతోషంగానే

    ప్రేమ్ చిరాకు చూసి సంతోషంగానే

    నైట్ అలా గడిచిపోగా.. తెల్లారగానే ప్రేమ్ నిద్ర లేచి తన పుట్టినరోజుకు ఎవరూ విష్ చేయలేదని అనుకుంటాడు. అప్పుడు తులసికి గుడ్ మార్నింగ్ చెప్పి.. ఈరోజు స్పెషల్ ఏంటి అని అడుగుతాడు. ఆమె మాత్రం ఈరోజు శనివారం కదా అంటుంది. దీంతో ప్రేమ్‌కు చిరాకు వస్తుంది. ఆ తర్వాత తాతయ్య, నానమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్లూ పట్టించుకోరు. అభి, అంకిత కూడా అలాగే వ్యవహరిస్తారు. దీంతో తన బర్త్‌డేను అందరూ మరిచిపోయారు అని అనుకుంటాడు ప్రేమ్. ఆ తర్వాత శృతి దగ్గరికి వెళ్తాడు. శృతి కూడా ఏం తెలియనట్టుగానే యాక్టింగ్ చేస్తుంది. ప్రేమ్ అలా చిరాకు పడుతుంటే అందరూ తెగ సంతోషపడతారు.

    ప్రేమ్‌కు సర్‌ప్రైజ్.. అంతా హ్యాపీగా

    ప్రేమ్‌కు సర్‌ప్రైజ్.. అంతా హ్యాపీగా

    ఎవరూ తన పుట్టినరోజును గుర్తుంచుకోలేని నిరాశగా ప్రేమ్ హాల్‌లోకి వెళ్తాడు. అప్పుడే ఇంట్లో పవర్ కట్ చేస్తారు. తర్వాత నెమ్మదిగా.. ఒక్కో లైట్ వెలిగిస్తారు. ఇల్లంతా బెలూన్లతో డెకరేట్ చేసి ఉంటుంది. పక్కనే కేక్ కూడా ఉంటుంది. ఇన్ని అరేంజ్‌మెంట్స్ చూసి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

    అందరూ వచ్చి అప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. దీంతో ప్రేమ్ సంతోషిస్తాడు. తర్వాత అందరూ నీ బర్త్‌డేను మరిచిపోయామని ఫీల్ అయ్యావు కదా అని అడుగుతారు. తర్వాత ప్రేమ్.. తులసి, నందూ, శృతి, అభి ఇలా అందరికీ కేక్ తినిపిస్తాడు. వాళ్లు కూడా అతడికి కేక్ పెడతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 584: The Family Plans a Surprise Birthday Party for Prem. Then He Feels Happy for That.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X