twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోల చేతుల్లోకి ఇండస్ట్రీ, మనుగడ కష్టం: దాసరి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ఇండియన్ సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేసిన నిర్మాత డా.డి.రామానాయుడు. అత్యధిక సినిమాలు నిర్మించడం మాత్రమే కాదు...దేశంలోని అన్ని బాషల్లోనూ సినిమాలు తీసిన ఘనత ఆయనది. ఆయన్ను అంతా మూవీ మొగల్ అని పిలుస్తుంటారు. అలాంటి రామానాయుడు గురించి యువకళావాహిని ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ యు.వినాయకరావు రచించిన పుస్తకం 'మూవీ మొగల్'. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆగస్టు 15న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.దాసరి నారాయణరావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని సూపర్ స్టార్ కృష్ణ స్వీకరించారు.

    ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ...''నాటితరం గురించి, నేటి తరానికి, భవిష్యత్తు తరానికి తెలియాలంటే ఇలాంటి పుస్తకాలు అవసరం. ఆ మధ్య ఓ యువ హీరోతో యస్.వి.రంగారావు గురించి ప్రస్తావన వస్తే, ఆయనెవరని ఆడగటంతో నేను నివ్వెరపోయాను. చిత్ర పరిశ్రమలోకి వచ్చే వాళ్లు సినిమా గురించి అవగాహన పెంచుకోవాలి. అలాంటి వారికి ఈ పుస్తకం చాలా ఉపయోగకరం.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

    హీరోలో చేతుల్లోకి పరిశ్రమ

    హీరోలో చేతుల్లోకి పరిశ్రమ


    రామానాయుడు లాంటి నిర్మాతను చూడలేం. అవసరమైతే సెట్స్ లో ఒక వర్క్ లా మారిపోతారు. కానీ ప్రస్తుతం కొంతమంది నిర్మాతలకి లొకేషన్ లో ఏం జరుగుతుందో కూడా తెలీడం లేదు. హీరోల చేతుల్లోకి ఇండస్ట్రీ వెళ్లిపోయిందని దాసరి వ్యాఖ్యానించారు.

    మనుగడ కష్టమైంది

    మనుగడ కష్టమైంది


    ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమా మనుగడ చాలా కష్టమయ్యింది. రామానాయుడులాంటి నిర్మాత కూడా చిన్న సినిమా తీసి విడుదల చేసుకోలేని పరిస్థితి రావడం బాధాకరమని దాసరి అన్నారు.

    కృష్ణ మాట్లాడుతూ

    కృష్ణ మాట్లాడుతూ


    ''రామానాయుడుగారు నిర్మించిన 'స్త్రీ జన్మలో' నేను రామారావుగారికి సోదరుడిగా నటించాను. నిర్మాతగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ధైర్యంగా అన్నింటినీ అధిగమించారు'' అన్నారు.

    పుస్తక రచయిత మాట్లాడుతూ

    పుస్తక రచయిత మాట్లాడుతూ


    ''భవిష్యత్తు తరాలకు చరిత్ర తెలియజేయాలనే తపనతో నేను పుస్తకాలు రాస్తున్నాను. డబ్బుకోసం మాత్రం కాదని స్పష్టం చేసారు.

    English summary
    
 Journalist U Vinayaka Rao wrote a book on Producer D Rama Naidu titled Movie Moghul, this book release function held at Prasad Labs in Hyderbad on Friday(15th Aug).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X