Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

వర్మ 'సత్య2' ఆడియో లాంచ్ విశేషాలు (ఫోటో ఫీచర్)

Posted by:
Published: Tuesday, September 17, 2013, 13:04 [IST]

హైదరాబాద్ :శర్వానంద్‌ హీరోగా నటించిన చిత్రం 'సత్య2'. అనైక హీరోయిన్. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్‌కుమార్‌ రెడ్డి నిర్మాత. సంజీవ్‌-దర్శన్‌, నితిన్‌- ఇష్క్‌ బెక్టర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని పూరి జగన్నాథ్‌ ఆవిష్కరించారు. బోయపాటి శ్రీను స్వీకరించారు.

శర్వానంద్‌ మాట్లాడుతూ.. రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో ఇలాంటి పాత్రలో నటిస్తానని అస్సలు ఊహించలేదు. ఈ సినిమా నా కెరీర్‌ను తప్పకుండా మలుపుతిప్పుతుంది, రామ్‌గోపాల్‌ వర్మ సినిమాలో చిన్న పాత్రైనా చేయాలన్నది నా కల. అది ఇప్పుడు తీరింది. ఆయన దగ్గర నుంచి రోజూ ఏదొక విషయం నేర్చుకున్నాను. ఈ సినిమాలో కొత్త రకం నేరాల్ని చూపించబోతున్నారు అన్నారు.

ఈ వేడుకకి ప్రముఖ దర్శకులైన పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, బోయపాటి శ్రీనులతో పాటు హీరో శర్వానంద్, రామ్ గోపాల్ వర్మ, మంచు విష్ణు, లక్ష్మీ మంచు తదితరులు హాజరయ్యారు.

ఈ చిత్రాన్ని సుమంత్ మెట్టు, చంద్రశేఖర్ ...ముమ్మత్ మీడియా అండ్ ఎంటర్టెన్మెంట్ ప్రై.లి, జెడ్ 3 పిక్చర్స్ బేనర్‌లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అమర్ మోహిలె, సినిమాటోగ్రఫీ : వికాస్ సారాఫ్, దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ.

చిత్రం ఆడియో విశేషాలు స్లైడ్ షోలో...

ఘనంగా వేడుక...

ఈ చిత్రంపై తెలుగు పరిశ్రమలో మంచి అంచనాలే ఉన్నాయి. దాంతో ఈ చిత్రం ఆడియో పంక్షన్ ని అంతా ఆసక్తిగా తిలకించారు. ఈ చిత్రం ఆడియోని నిర్మాతలు ఆటపాటలతో ఘనంగా జరిపారు. చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ వేడుక చోటు చేసుకుంది.

 

ఆవిష్కరణ...

 

తొలి సీడీని పూరి జగన్నాథ్‌ ఆవిష్కరించారు. బోయపాటి శ్రీను స్వీకరించారు. వీరిద్దరూ తెలుగుని ఏలుతున్న ప్రముఖ దర్శకులు కావటం విశేషం. అలాగే పూరి జగన్నాథ్ ..వర్మ శిష్యుడు కావటంతో ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి హాజరయ్యారు.

 

పాటలు బాగున్నాయి...

ఆడియోసీడీని బోయపాటి శ్రీను, రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి తొలి ప్రతిని పూరి జగన్నాథ్‌కి అందించారు. మాఫియా చిత్రమైన మాత్రాన పాటలు విషయంలో డార్క్ మూడ్ కనపడదని, పాటలు చాలా బాగున్నాయని పంక్షన్ కి విచ్చేసిన అతిధులు అన్నారు. ఈ పంక్షన్ ని వర్మ చాలా ఆస్వాదించారు.

 

లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ...

వర్మ దర్శకత్వంలో నటించటం అనేది నా చిన్నప్పటి కల. అలాంటిది నేను ఒకటి కాదు రెండు సినిమాలలో యాక్ట్ చేసాను. నెక్ట్స్ టైమ్ ఓ పదిమంది చూసేటట్లు తీయండి. ఆయన ప్రేమ పాట పాడారనే అనేది ఊహించలేకపోతున్నారు. చిత్రం చాలా బాగా వచ్చిందని, వర్మ సినిమాలు చాలా బాగుంటాయని, ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని అని అన్నారు. లక్ష్మి ప్రసన్న గతంలో వర్మ దర్శకత్వంలో తెలుగులో దొంగల ముఠా చిత్రంలో నటించారు.

 

రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ....

''నేను ముంబై వెళ్లిన కొత్తలో గ్యాంగ్‌స్టర్‌ల గురించి ఏమీ తెలియదు. పలు పుస్తకాలు చదివి గ్యాంగ్‌స్టర్‌లు, రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, పోలీసుల ఆలోచనలు ఎలా ఉంటాయో అవగాహన పెంచుకొన్నాను. ఆ అవగాహనతో నేను ఇప్పుడు మాఫియా సామ్రాజ్యంలోకి వెళితే ఎలా ఉంటుందన్నదే ఈ కథ. ఇందులో ఓ మంచి ప్రేమకథ కూడా ఉంటుంది. ఓ ప్రియా ఓ ప్రియా... అనే పాట పాడాను. శర్వానంద్‌ సహజసిద్ధమైన నటనను చూసే నేను ఇందులో ఆయన్ని ఎంచుకొన్నాను'' అన్నారు.

 

దేవకట్టా మాట్లాడుతూ...

సినిమా సక్సెస్ అవుతుందని, తనకు రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే చాలా ఇష్టమని అన్నారు. సినిమా విజయంపై నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

 

బోయపాటి శ్రీను మాట్లాడుతూ...

''పాటలు బాగున్నాయి. సంగీతం బాగుంది. 'సత్య2' మంచి విజయం సాధించాలి. వర్మ పాడిన పాట చాలా బాగుంది'' అన్నారు.

 

మంచు విష్ణు సైతం...

ఈ పంక్షన్ కి మంచు విష్ణు సైతం హాజరయ్యారు. ఆయన తన సోదరి లక్ష్మి ప్రసన్న కలిసి వచ్చారు. చిత్రం హీరో శర్వానంద్, విష్ణు మంచి స్నేహితులు కావటంతో ఈ పంక్షన్ కి హాజరయ్యారు. వర్మతో ఇలా ప్రక్కన కూర్చుని ముచ్చటించారు.

 

వర్మ మాట్లాడుతూ....

ఇందులో నేను ఓ ప్రేమ గీతం పాడాను. దానికి కారణం ఒక్కటే. నాకు ప్రేమగీతం పాడాలని ఓ చిన్న కోరిక ఉంది. అది తీర్చుకోవడానికి పాడాను'' అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. ‘సత్య'కి ‘సత్య-2'కి చాలా తేడా ఉంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో సాధించాలి అనుకుంటారు. ఆ ఆలోచనకు సరైన రూపమే ‘సత్య-2'.

 

వర్మ తన స్పీచ్ కంటిన్యూ చేస్తూ...

‘‘శర్వానంద్ నేనేదో అవకాశమిచ్చినట్లు మాట్లాడాడు. నేను అవకాశాలివ్వను... తీసుకుంటాను. క్రిమినల్స్‌తో పరిచయం ఉండటం వల్లే ఇలాంటి సినిమాలు ఇంత రియలిస్టిక్‌గా తీయగలుగున్నానని చాలా మంది అభిప్రాయం. నిజానికి నేను ఏ క్రిమినల్‌తో ఒక్క రోజు కూడా డిన్నర్ చేయలేదు. నిజజీవితంలో జరిగే అనుభవాలే నా సినిమాల్లో కనిపిస్తాయి''అని చెప్పారు.

 

లైవ్ తో...

నితిన్ రైక్వార్, సంజయ్, దర్శన్, శ్రీ ఇషాక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకను ఛానెల్స్ వారు లైవ్ ప్రసారం చేసారు.

 

వీరంతా..

ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న, హరీష్‌శంకర్‌, నందిని రెడ్డి, సిరాశ్రీ, ఆర్‌.పి.పట్నాయక్‌, బ్రహ్మాజీ, దేవాకట్టా, ఐజీ సీతారామాంజనేయులు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

శర్వానంద్‌ మాట్లాడుతూ

శర్వానంద్‌ మాట్లాడుతూ ''వర్మ సినిమాలో నటించాలన్న కల ఈ సినిమాతో నెరవేరింది. నాపై నమ్మకంతో ఈ అవకాశమిచ్చారు. ఇన్నేళ్లు నేను చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా చేయడం మరొక ఎత్తు'' అన్నారు. పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ''రామ్‌గోపాల్‌ వర్మగారికి క్రైమ్‌ అంటే చాలా ఆసక్తి. దేశంలో ఎక్కడ ఏ నేరాలు జరిగినా... అందుకు కారణాలేమిటో విడమర్చి చెబుతుంటారు. అంత జ్ఞానం ఉంది ఆయనకి. అందుకే పోలీసు అకాడమీలో జరిగే శిక్షణ తరగతుల్లో ఆయనతో పాఠాలు చెప్పిస్తుంటారు. జీవితంలో పైకి రావాలన్న కసి ఉన్న ప్రతి ఒక్కరూ 'సత్య2' ని చూడాలి. అంత బాగా తీశారు వర్మ'' అన్నారు.

English summary
‘Satya 2’ movie audio released at HICC N Convention Hyderabad. Sharwanand is playing the title role and Anaika Soti is playing the female lead. Ram Gopal Varma is planning to release the film in Hindi, Telugu, Tamil and Punjabi.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice