twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీ మ్యాటర్ పై సమంత ట్వీట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : సమంత బికినీ వేస్తుందంటూ వచ్చిన వార్త కుర్రాళ్లలలో సంచలనం రేపింది. అయితే తాను బికినీ వేయటం లేదని, అది మీడియా క్రియేషన్ అని సమంత ట్విట్టర్ ద్వారా కొట్టిపారేసింది. ''నా సినిమాల్లో నా పాత్రలు చూసి కూడా నా గురించి ఇలాంటి గాసిప్పులు ఎలా పుట్టించగ లుగుతున్నారు?'' అని మీడియాపై విరుచుకుపడింది..

    ' నా గత సినిమాలు చూస్తె మీరు నేను బికినీ వేసుకునే వార్తలు రూమర్స్ అని తెలుస్తుంది. నేను రాబోయే సినిమాలో బికినీ వేసుకోబోతున్నాను అనేది రూమర్ మాత్రమే.. ఇక ఆ వార్తల్ని ఆపేయండి' అని సమంత ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ 'రభస'చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె బికినీ వేయనుందని, కథానుగుణంగా ఆ సన్నివేశం ఉండటంతో బికినీలో కనిపించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ఈ కథనాలే సమంత కోపానికి కారణం. దాంతో వాటిని ఖండిస్తూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు సమంత.

    ఇక ఎన్టీఆర్, సమంత జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ బాబు నిర్మిస్తున్న చిత్రానికి 'రభస' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'రభస' టైటిల్ ఫైనల్ కాదని....త్వరలోనే అసలు టైటిల్ ప్రకటిస్తారని సమంత తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సినిమా షూటింగ్ ఈ రోజే మొదలైన విషయం కూడా సమంత వెల్లడించారు.

    కాగా....ఈ చిత్రానికి మొదట అనూప్ రూబెన్స్‌ని సంగీత దర్శకుడుగా అనుకున్నారు. కానీ అతన్ని తొలగించి తమన్‌ను తీసుకున్నట్లు సమాచారం. అనూప్ రూబెన్స్ ఇచ్చిన ట్యూన్స్ నచ్చక పోవడంతో పాటు దర్శకుడితో అనూప్ రూబెన్స్‌కు విబేధాలే ఈ మార్పుకు కారణమని తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మళయాలం హీరోయిన్ నజ్రియాను సెకండ్ హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.

    ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    Samantha tweeted..."If u have watched my films u wldnt need me to tell u that the rumour of me sporting a bikini in my next is just a rumour...put this to rest"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X