twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తుస్ ...( 'కిస్‌' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.5/5
    నటీనటులు: అడవి శేషు, ప్రియా బెనర్జీ, భరత్ రెడ్డి తదితరులు
    కెమెరా: షెనీల్‌దియో
    సంగీతం: శ్రీ చరణ్
    సహనిర్మాత: ఆనంద్‌ బచ్చు,
    నిర్వహణ: భవానీ అడివి,
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అడివి శేషు.

    కిస్‌ అంటే 'కీపిట్‌ సింపుల్‌ స్టుపిడ్' అనే వెబ్రివేషన్ తో వచ్చిన ఈ చిత్రం దానికి తగినట్లే ఉంది. రొమాంటిక్ కామెడీ జెనర్ లో వచ్చిన ఈ చిత్రంలో ఆ రెండూ కావాల్సినంతగా ఎలివేట్ కాకపోవటం,లెంగ్త్ ఎక్కువ కావటం,అడవి శేషు..మాస్ హీరోగా అనిపించుకోవాలనే తాపత్రయం..సినిమాను చూసేందుకు ఇబ్బందిగా మార్చేసాయి. అడవి శేషు హీరోగా ఓకే అనిపించుకున్నా...దర్శకుడుగా ఫెయిలయ్యాడనే చెప్పాలి. దానికి తోడు ఇప్పటికే పంజా,బలుపు చిత్రాలతో నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకున్న శేషు ని హీరోగా డైజస్ట్ చేసుకోవటం కష్టమే అయ్యింది. ఓవరాల్ గా చిత్రం మిస్ ఫైర్ గా మారింది.

    శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటున్న తెలుగు అమ్మాయి ప్రియ(ప్రియ బెనర్జి) తండ్రి చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ ఆమెకు రిస్ట్రిక్షన్స్ పెడుతూంటాడు...అంతేగాక రవి (భరత్ రెడ్డి) తో ఆమెకు ఇష్టం లేని పెళ్లి ఫిక్స్ చేస్తాడు. దాంతో అప్పటికే విసుగెత్తిపోయిన ఆమె ఇంట్లోంచి పారిపోయి ఆత్మహత్య చేసుకుందామనుకుంటుంది. ఆ ప్రయత్నం నుంచి ఆమెను సేవ్ చేస్తాడు సన్నీ(అడవి శేషు). సన్నీ...హాలీవుడ్ లో హీరోగా వెలుగాదమని దొంగ వీసాతో అమెరికా ప్రయాణం కట్టిన దొంగతనం రాని దొంగ . అతనికి అక్కడ సక్సెస్ కాకపోవటంతో తిరుగు ప్రయాణం పెట్టుబెకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఆమెతో పరిచయం ఏర్పడుతుంది. ఆమెకు అసలు జీవితం అంటే ఏమిటో చెప్తాడు సన్ని. ఈ క్రమంలో అతనితో ప్రేమలో పడుతుంది ప్రియ. ఆ తర్వాత ఏమి జరిగింది. ఈ ప్రేమ కథ ఎలా ముగిసింది అనేదే మిగతా కథ.

    రోమన్ హాలీడే చిత్రం నుంచి ఇలాంటి కథలు ఎన్నో ప్రపంచంలో అన్ని భాషల్లోనూ తెరకెక్కాయి. తెలుగులోనూ కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఈ తరహా రొమాంటిక్ కామెడీలు సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగితే ఎప్పటికప్పుడు కొత్త ఫీల్ ని ప్రేక్షకుడుకి అందిస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి సినిమాలకు సీన్స్, హీరో,హీరోయిన్స్ మధ్య చోటు చేసుకునే సంఘటనలు నుంచి వచ్చే ఎమోషన్స్ హైలెట్ గా నిలిచి సినిమాని నిలబెడతాయి. కథగా ఎత్తుగడ బాగానే ఉన్నా... సీన్స్ పరంగా తడబడ్డాడు...స్లో నేరేషన్ తో కొన్నిచోట్ల విసిగించాడు. సెకండాఫ్ లో చాలా డ్రాగ్ చేసిన సీన్స్ బాగా చిరాకు తెప్పిస్తాయి. స్క్రీన్ ప్లే కూడా ఇంకా బాగా గ్రిప్పింగ్ చేసుకోవాల్సింది. దాదాపు ఇరవై ..ఇరవై ఐదు నిముషాలు ఎడిట్ చెయ్యాల్సి ఉంటుంది.

    నటుడుగా మాత్రం అడవి శేషు మంచి మార్కులే వేయించుకున్నాడు. ఎమోషన్ సీన్స్ లోతప్ప సినిమాలో చాలా చోట్ల తానేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలే కనపడ్డాయి. ఇక చిత్రంలో హీరోయిన్ ప్రియా బెనర్జీ హెలెట్. ఆమె అందచందాలే సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా కొన్ని రొమాంటిక్ సీన్స్ లో ఆమె చాలా బాగా చేసింది.అలాగే శాన్‌ఫ్రాన్సిస్కో ని కూడా చాలా బాగా చూపించారు. సంగీతం సోసో గా ఉంది. కెమెరా వర్క్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బాగా చేయించాలి.

    ఫైనల్ గా అడవి శేషు తనను తాను మాస్ హీరోగా చూపించేందుకు చేసిన ప్రయత్నం ఇది. అయితే వేరే దర్శకుడుని పెట్టుకుని దృష్టి మొత్తం నటన మీదే పెడితే బాగుండేది. బి,సి సెంటర్స్ వర్కవుట్ కాకపోయినా..మల్టిప్లెక్స్ లలో నడిచే అవకాసం ఉంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Adivi Sesh and Priya Bannerjee have teamed up for the movie ‘Kiss’ released today with divide talk. The film has been directed by Sesh himself and Adivi Sai Kiran is the producer. Sricharan Pakala has composed the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X