twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్ద హీరోలు సైతం భయపడి వెనక్కి

    By Srikanya
    |

    చెన్నై : ఆస్కార్‌ ఫిలిమ్స్‌ బ్యానరుపై రవిచంద్రన్‌ నిర్మాణ సారథ్యంలో రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'ఐ'. శంకర్‌ దర్శకత్వంలో విక్రం హీరోగా రూపొందుతున్న ఈ సినిమా ఎన్నో విశేషాల సమాహారంగా వస్తోంది. దీపావళి సందర్భంగా తెరపైకి తీసుకొస్తున్నట్లు నిర్మాత చెప్పడంతో.. ఇతర సినిమాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. విజయ్ వంటి స్టార్ హీరోలు సైతం వెనక్కి వెళ్తూండటంతో ఆసక్తిగా మారింది.

    ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించిన 'కత్తి', హరి దర్శకత్వంలో విశాల్‌, శ్రుతిహాసన్‌ జంటగా రూపొందిన 'పూజై', ధనుష్‌ హీరోగా సిద్ధమైన 'అనేగన్‌' ఇప్పటికే దీపావళి బరిలో ఉన్న విషయం తెలిసిందే. 'ఐ'ని చూసి.. ఈ సినిమాలు బరి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లు సమాచారం.

    Shankar's Movie AI Effect on Tamil Industry

    దీపావళి సెంటిమెట్‌తో ఉన్న విజయ్‌.. 'ఐ' రాక తన చిత్ర వసూళ్లపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారట. మరోవైపు 'పూజై', 'అనేగన్‌' కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చివరకు ఎవరు మిగులుతారో మరికొన్ని రోజుల్లో తేలనుంది.

    ఇక ఈ చిత్రం తెలుగు రైట్స్ 20 కోట్లు చెప్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. లక్ష్మి గణపతి ఫిలింస్ వారు 15 కోట్లు వరకూ చెల్లించటానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా డీల్ ఫైనల్ కాలేదని చెప్పుకుంటున్నారు. గతంలో రోబో చిత్రానికి 27cr కోట్లు ఎపి,తెలంగాణ థియోటర్ రైట్స్ నిమిత్తం చెల్లించారు. అయితే అక్కడ రజనీకాంత్ ఉండటం వల్ల ఆ రేటు పలికింది. ఇప్పుడు ఈ డీల్ ఎంతవరకూ వెళ్లి ఆగుతుందో చూడాలి.

    English summary
    Aascar Films Ravichandran seems to have publicly announced in Chennai that his upcoming production venture, Ai directed by Shankar will hit the screens on Diwali 2014.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X