వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయమ్మ వ్యాఖ్యల్లో అర్థం లేదు: మనీష్ తివారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manish Tiwari
న్యూఢిల్లీ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ స్పందించారు. సిబిఐ దర్యాప్తులో కాంగ్రెసు జోక్యం చేసుకోబోదని ఆయన ఆదివారం రాత్రి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన అన్నారు. కాగా, వైయస్ జగన్ అరెస్టును రాష్ట్ర కాంగ్రెసు సమర్థించింది. అరెస్టు సమంజసమేనని వ్యాఖ్యానించింది.

సాక్ష్యాలను తారుమారు చేస్తారని జగన్‌ను అరెస్టు చేసినట్లు సిబిఐ చెప్పిందని జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు రంగారావు అన్నారు. జగన్‌ను అరెస్టు చేతులు దులుపుకుంటే సరిపోదని, జగన్ దోచుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జగన్ లక్ష కోట్ల రూపాయలు దోచుకోవడానికి సహకరించిన వారి సంగతేమిటని ఆయన అడిగారు. కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావును, మంత్రులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎట్టి పరిస్థితిలో కూడా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని జనగ్ పిలుపునిచ్చినట్లు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి చెప్పారు. జగన్ సన్నిహితుడిగానే తాను ఆదివారం ఉదయం ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. జగన్ అరెస్టును పిరికిపందల చర్యగా మాజీ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. సిబిఐని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పావుగా వాడుకుంటున్నాయని ఆమె అన్నారు. ప్రజా పోరులో జగన్‌దే అంతిమ విజయమని ఆమె అన్నారు. వైయస్ మరణానికి, జగన్ అరెస్టుకు ముడి పెట్టడాన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఖండించారు.

దిల్‌కుషా అతిథి గృహం వద్ద బైఠాయించిన విజయమ్మను, ఆమె కుటుంబ సభ్యులు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక వాహనాలను రప్పించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. వైయస్ విజయమ్మతో పాటు కుటుంబ సభ్యులను తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ధర్నా విరమించుకోవాలని పోలీసులు వైయస్ విజయమ్మకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వినలేదు. విజయమ్మతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ భార్య భారతి, సోదరి షర్మిళ రాజభవన్ సమీపంలోని దిల్‌కుషా అతిథి గృహం వద్ద ప్లాట్‌ఫారంపై బైఠాయించారు.

English summary
AICC spokesperson Manish Tiwary condemned YS Vijayamma's comments. YS Jagan's mother and Pulivendula MLA staged dharna in front of Dilkusha guest house. CBI has arrested YSR Congress president YS Jagan. After taking all the precautionary measures, CBI has announced his arrest. CBI has questioned YS Jagan for three days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X