వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టికి నిరాశే: బడ్జెట్‌పై కెసిఆర్, అన్యాయమన్న పొన్నాల

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ తెలంగాణకు నిరాశే మిగిల్చిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. రాష్ట్రానికి కొత్తగా ఏమి ఇవ్వలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యానవన విశ్వవిద్యాలయం కూడా పునర్విభజన చట్టంలో ఉన్నదేనని ఆయన అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఈ బడ్జెట్‌లో సరైన విధంగా నిధులు కేటాయించాలని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ చేసిన వాగ్ధానాలకు బడ్జెట్‌కు ఎలాంటి సంబంధం లేదని విమర్శించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి ఎఫ్‌డిఐలను తప్పుపట్టిందని, ఇప్పుడేమో ఎఫ్‌డిఐలను ఆహ్వానిస్తోందని మండిపడ్డారు.

Injustice to Telangana in Budget, says CM KCR

ఇది ఇలా ఉండగా కేంద్ర బడ్జెట్‌ నిరాశజనకంగా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకయీ వ్యవహారాల కమిటీ సభ్యుడు డిఎ సోమయాజులు అన్నారు. బడ్జెట్‌లో పేర్కొన్న అంకెలన్నీ ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన అనేక అంశాలు బడ్జెట్ ప్రసంగంలో లేవని చెప్పారు.

ఏపికి కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేవని సోమాయాజులు అన్నారు. ఏపికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలకు బడ్జెట్ ప్రసంగంలో చోటు దక్కలేదని చెప్పారు. విధాన పరమైన నిర్ణయాల్లో కొన్ని మాత్రమే సానుకూలంగా ఉన్నాయని అన్నారు.

English summary

 Telangana Chief Minister K Chandrasekhara Rao Thursday slammed the budget saying BJP-led government has done injustice to the newly-created state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X