హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోటీ, పవన్ పార్టీపై మంచు లక్ష్మీ, పొత్తుకు రాఘవులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manchu Laxmi on her contest
హైదరాబాద్: తమ కుటుంబం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయడం లేదని ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి ప్రసన్న చెప్పారు. తాము పోటీ చేస్తే బహిరంగంగా ప్రకటిస్తామన్నారు. ఇదే సమయంలో నటుడు పవన్ కల్యాణ్ కొత్త పార్టీ జనసేన, రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించారు.

పవన్ కళ్యాణ్‌కు తాను తన మద్దతు తెలుపుతున్నానని మంచు లక్ష్మీ చెప్పారు. ఆల్ ది బెస్ట్ అన్నారు. ప్రజల కోసం పని చేసే వారికే తన మద్దతు ఉంటుందని చెప్పారు. కాగా, మంచు లక్ష్మీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేయనున్నారని ఊహాగానాలు వినిపించాయి.

పవన్‌కు రాఘవులు ఆహ్వానం

ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే పొత్తుకు ఆహ్వానిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వామపక్ష పార్టీలు కలిసి పని చేయడానికి సిద్ధమయ్యాయని అన్నారు. వామపక్ష పార్టీలు తెరాసతో కానీ, ఇతర పార్టీలతో కానీ పొత్తులు పెట్టుకోవడానికి లోతుగా చర్చలు సాగుతున్నాయన్నారు.

కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టడాన్ని వామపక్షాలు నిన్న స్వాగతించాయి. ఈ సందర్భంగా నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నటుడు పవన్ కల్యాణ్ అందంగా ఉంటాడు అంతే తప్ప ఇంకేమీ తెలియదన్నారు. ఆయన అందగా ఉంటాడని తెలుసునని, ఓట్లు రాబడుతారో లేదో తెలియదన్నారు. మిగతా అంశాలపై తాము పార్టీ పెట్టాక ఆలోచిస్తామన్నారు.

English summary
Actor and Producer Manchu Laxmi on Friday clarified on her contest in next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X