చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళ లోదుస్తుల్లో బంగారం: ఏడుగురి పట్టివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

7 women held at airport in one day for smuggling gold
చెన్నై: విదేశాల నుంచి రహస్యంగా బంగారం తరలిస్తూ ఏడుగురు మహిళలు చెన్నై విమానాశ్రయంలో పట్టుబడ్డారు. బంగారం స్మిగ్లింగ్ చేస్తూ ఏడుగురు మహిళలు ఒకేసారి చెన్నై విమానాశ్రయంలో పట్టుబడడం ఇదే తొలిసారు. కౌలాలంపూర్ నుంచి గురువారం రాత్రి చెన్నైకి వచ్ిచన మలేషియన్ ఎయిర్ లైన్స్‌లో విమానంలో రాణి అనే మహిళ దిగింది.

చెన్నై విమానం నుంచి దిగిన రాణి (43)ని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆమె లోదుస్తుల్లో 14 బంగారు బిస్కెట్లు దొరికాయని అదఇకారులు చెప్పారు ఒక్కొక్క బంగారం బిస్కెట్ బురువు వంద గ్రాములు ఉంటుందని వారు చెప్పారు.

అదే విధంగా, సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో చెన్నై వచ్చిన శ్రీలంకకు చెందిన వడివళగిరి (48), పింగారా (40), శివగంగైకి చెందిన మరియమ్మాళ్ (50), జీనత్ (38)లను కూడా కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ నలుగురు మహిళలు 1550 గ్రాముల బంగారం బిస్కెట్లతో పట్టుబడ్డారు.

సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన చెన్నైకి చెందిన కనియమ్మాళ్ (39) తన సెల్‌ఫోన్ బ్యాటరీ స్థానంలో బంగారం బిస్కెట్‌ను ఇంచి తెస్తుండగా దాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో బేగం అనే మహిళను కూడా పట్టుకున్నారు. ఈ ఏడుగురు మహిళల నుంచి ఒకే రోజు కోటి రూపాయల విలువైన 3.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు చెప్పారు. పట్టుబడిన మహిళలు స్మగ్లింగ్ ముఠాకు చెందినవారని అనుమానిస్తున్నారు.

English summary

 Customs officials on Thursday arrested seven women at the city airport for smuggling 3.3kg of gold worth close to 90 lakh into the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X