వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాలిన్ చనిపోతాడని అళగిరి అన్నాడు: కరుణానిధి

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై‌‌: స్టాలిన్ కొద్ది నెలల్లో చనిపోతాడని అళగిరి అన్నాడని, ఓ తండ్రి ఆ మాటలను ఎలా సహిస్తాడని, స్టాలిన్‌పై అళగిరి ఎందుకు ద్వేషం పెంచుకున్నాడో తెలియదని డిఎంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అన్నారు. సోదరుడు స్టాలిన్ పట్ల చాలా కఠినమైన వ్యాఖ్యలు చేసిన అళగిరిని తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తి లేదని ఆయన మంగళవారం ్న్నారు.

సోదరుడు స్టాలిన్‌పై కఠినమైన వ్యాఖ్యలు చేసినందుకు అళగిరిని పార్టీనుంచి సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. అళగిరి సస్పెన్షన్ వల్ల పార్టీకి పెద్ద నష్టం లేదని, మేలో జరిగే లోకసభ ఎన్నికల్లో పార్టీకి ఏ విధమైన నష్టం జరగదనే ఉద్దేశంతో కరుణానిధి అన్నారు.

Alagiri said brother Stalin would die, reveals father M Karunanidhi

డిఎంకెలో ప్రజాస్వామ్యం లేదని అళగిరి ఎన్టీటీవితో అన్నారు. కరుణానిధిని ఎవరో బ్లాక్ మెయిల్ చేశారని ఆయన అన్నారు. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని, న్యాయం కోసం పోరాటం చేస్తానని ఆయన అన్నారు. తన అనుచరులను సంప్రదించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటానని ఆయన చెప్పారు.

తన తండ్రి కరుణానిధి డిఎంకె అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారని, ఆ పదవికి పోటీ జరుగుతుందని, తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని అళగిరి 2010లో చెప్పారు. ఈ ప్రకటనతో రాజకీయాల నుంచి తప్పుకోవాలనే తన ఉద్దేశ్యాన్ని కరుణానిధి అప్పట్లో విరమించుకున్నారు. స్టాలిన్‌ను కరుణానిధి తన వారసుడిగా ప్రకటించడంపై అళగిరి ఆగ్రహంతో ఉన్నారు.

English summary
"He (Alagiri) even said Stalin would die in few months. How can a father tolerate this? I don't know why Alagiri has nurtured hatred against Stalin," the DMK chief Karuna Nidhi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X