వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ జైలులో తెలుగు ఖైదీ: వివరాలిస్తే విడుదల

|
Google Oneindia TeluguNews

Telugu youth in Pakistan jail
హైదరాబాద్: పాకిస్థాన్‌లోని లాహోర్ కేంద్ర కారాగారంలో బందీగా ఉన్న ఖైదీలలో ఓ తెలుగు యువకుడు ఉన్నట్లు పాకిస్థాన్ నుంచి భారత్‌కు సమచారం వచ్చింది. సరైన వివరాలు లేకపోవడంతో అతని విడుదల ఆగిపోయిందని తెలిపింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పరస్పరం ఖైదీల అప్పగింతకు ఇటీవలే ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

భారత్‌కు చెందిన తెలుగు ఖైదీ విడుదలకు పాకిస్థాన్ అధికారులు సిద్ధమయ్యారు. అయితే అతడికి సంబంధించిన పూర్తి వివరాలేవీ లేకపోవడంతో అక్కడి అధికారులు భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఖైదీకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కేంద్రం కోరింది.

సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రవీందర్ రెడ్డి బుధవారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఖైదీ పేరు రమేష్ అని, అతనికి 20ఏళ్ల వయస్సు ఉంటుందని, ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలని, కుడి చెంపపై పెద్ద పుట్టుమచ్చ ఉందని పేర్కొన్నారు.

ఈ వివరాలతో పోలికలున్న వ్యక్తి కుటుంబం తమని సంప్రదిస్తే పాస్‌పోర్ట్ సిద్ధం చేసి పాకిస్థాన్‌కు పంపిస్తామని ఆయన తెలిపారు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేస్తే ఖైదీగా ఉన్న రమేష్‌ను పాకిస్తాన్ విడుదల చేస్తారు.

English summary
It said that a Telugu youth held in Pakistan jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X