హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అశ్లీల పోస్టర్ల వివాదం

By Staff
|
Google Oneindia TeluguNews

Current
హైదరాబాద్: ఆడపిల్లల మీద దాడులు, హాస్టళ్ళలో మానభంగాలు ప్రభుత్వాన్ని కలవరపెడుతుండగా అశ్లీల సినిమా పోస్టర్లు ప్రగతిశీల మహిళల ఆగ్రహానికి గురవుతున్నాయి. పోస్టర్లను చూసి కుర్రకారు సినిమాలకు పరుగులు తీస్తున్నారు. ఆ సినిమాల్లోని దృశ్యాలను చూసి చెడిపోయి అమాయకులైన ఆడపిల్లల మీద దాడులు చేస్తున్నారు. పోస్టర్ల ప్రమాణాలు ఆరోగ్యకరంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన అవసరముంది.

శర్వానంద్‌ హీరోగా వచ్చిన 'రాజు మహరాజు" చిత్రం పోస్టర్‌ మీద శర్వానంద్‌ హీరోయిన్‌ గుండెలమీద నీళ్లతో రుద్దే సన్నివేశాన్ని పోస్టర్‌గా వేశారు. ఈ పోస్టర్‌ను చూసినవారేవ్వరికై నా నిర్మాత అత్యాశ ఇట్టే అర్థమవుతుంది. అజయ్‌ హీరోగా చేసిన 'ఆ ఒక్కడు" చిత్రంలోనూ నీటిలో తడిసే దృశ్యాలే అధికంగా ఉన్నాయి. ఇక సుశాంత్‌ హీరోగా నటించిన చిత్రం 'కరెంట్‌" గురించి చెప్పాలంటే...నిజంగా ఆ చిత్రం పోస్టర్లు చూస్తే ఎవరికైనా షాక్‌ తగలాల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లలో సుషాంత్‌ హీరోయిన్‌ స్నేహ ఉల్లాల్‌ పొట్టమీద మెహిందీపెట్టే ఫోటోతో రూపొందించిన పోస్టర్లు రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కథ డిమాండ్‌ మేరకే ఈ దృశ్యాన్ని పెట్టామని నిర్మాతలు చెప్పుకుంటున్నారు. 'అది సినిమాలో కేవలం ఒక నిమిషం నిడివి గల దృశ్యం. అది కూడా సినిమా క్లైమాక్స్‌లో వస్తుంది. అంతేకాని సినిమా మొత్తం వల్గారిటీ ఉందని అనుకోవద్దు. ఇది పూర్తి కుటుం బకథా చిత్రం. నాకు తెలిసి ఆ పోస్టర్‌ కేవలం సరదాకు తీసింది". అని వారు చెప్పుకోవడం విశేషం. ఇక 'రాజు మహా రాజు" చిత్రం చేసిన నిర్మాతలు బీచ్‌ సాంగ్‌ తో కూడు కున్న పోస్టర్లను నగరం మొత్తం అంటించారు. చివరకు బీచ్‌లో వచ్చే ఆ పాట 'మక మక మకరేనా"ను తొలగించాలని నిర్ణయించారు. దీనికి ప్రధానకారణం ఆ పాట కథకు అనుగుణంగా లేదని ప్రేక్షకులనుండి అభ్యంతరం రావడమే. 'మా చిత్రం కుటుంబకథాచిత్రమే. అందులో ఎటువంటి అనుమానం లేదు" అని చిత్ర దర్శకుడు దుర్గాశంకర్‌ నాథ్‌ చెప్పారు. 'మేము కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం చేశాము.

ఆపాటను కేవలం పబ్లీసిటి కోసం మాత్రమే వాడుకోవాలనుకున్నాం. అయితే ప్రేక్షకులు మాత్రం ఆ పాట కథకు అనుగుణంగా లేదన్నారు. దాంతో పాటను తొలగించాము". అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆకాష్‌ తనే దర్శకత్వ బాధ్యతలను తలమీదకెత్తుకుని నటించిన చిత్రం 'స్వీట్‌హార్‌"్ట. ఆయన పూర్తిగా యూత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం చేశాడట. 'ఇది ఒక ప్రేమకథ. పూర్తిగా యూత్‌ ఓరియెంటెడ్‌ చిత్రం. వారు ఏది ఆశిస్తారో అదే పోస్టర్స్‌లో పెట్టాము. చిత్రంలో కథానాయకుడు హీరోయిన్‌ ను లవ్‌ చేస్తాడు. అయితే అతన్ని మాత్రం మరికొంతమంది లవ్‌ చేస్తారు. వారిలో ఒకరు హీరో హృద యాన్ని గాయపరిచే విధానాన్ని సింబాలిక్‌గా చూపించాలనే ఆ దృశ్యాన్ని పోస్టర్స్‌లో ముద్రించాము. హీరో ఏంచేయాలో తేల్చుకోలేకపోయే విషయాన్ని యాడ్‌గా వేశాము అంతే". అని చిత్ర నిర్మాతలు సమర్థించుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X