వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ సభలు హిట్టా, ఫట్టా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెసు యువరాజు రాహుల్ గాంధీ సోమవారం తెలంగాణలో రెండు సభల్లో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లోనూ, నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లిలోనూ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. తన ప్రసంగంలో రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును లక్ష్యం చేసుకుని మాట్లాడారు. కెసిఆర్‌ పేరెత్తకుండా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

అయితే, రాహుల్ గాంధీ సభలకు ప్రజలు పలుచగా ఉన్నారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల కారణంగానో, కాంగ్రెసు నాయకుల మధ్య సమన్వయ లోపం వల్లనో గానీ ప్రజలు రాహుల్ గాంధీ సభలకు పెద్దగా రాలేదు. అంతకు ముందు కరీంనగర్‌లో జరిగిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సభకు కూడా పెద్దగా జనం రాలేదు.

సోనియా, రాహుల్ గాంధీల సభలపై కాంగ్రెసు తెలంగాణ నేతలు ఎంతో ఆశ పెట్టుకున్నారు. తెలంగాణను తాము కాబట్టే ఇవ్వగలిగామని, మరో పార్టీ అయితే ఇచ్చి ఉండేది కాదని సోనియా గతంలోనూ, రాహుల్ సోమవారంనాడు ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నించారు. రాహుల్ బహిరంగ సభల ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాల్సిందే.

చేయి ఊపుతూ అభివాదం..

చేయి ఊపుతూ అభివాదం..

మహబూబ్‌నగర్ వచ్చిన రాహుల్ గాంధీ ప్రజలకు అభివాదం చేస్తూ ఇలా కనిపించారు. ఆయన తెలంగాణ కాంగ్రెసు నేతలు స్వాగతం చెప్పారు.

రాపోల్ ఆనంద భాస్కర్‌తో రాహుల్

రాపోల్ ఆనంద భాస్కర్‌తో రాహుల్

రాజ్యసభ సభ్యుడు రాపోల్ ఆనందభాస్కర్‌ను పలకరిస్తూ రాహుల్ గాంధీ ఇలా.. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నా లక్ష్మయ్యను కూడా చూడవచ్చు.

అభివాదం చేస్తూ...

అభివాదం చేస్తూ...

రాహుల్ గాంధీ మహబూబ్‌నగర్ వేదిక మీది నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు. ఆయన మేడిన్ తెలంగాణ బ్రాండ్‌ను ప్రచారంలోకి తెచ్చారు.

జైపాల్ రెడ్డితో రాహుల్ ఇలా..

జైపాల్ రెడ్డితో రాహుల్ ఇలా..

కేంద్ర మంత్రి, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు జైపాల్ రెడ్డితో రాహుల్ గాంధీ వేదికపై కరచాలనం చేస్తూ ఇలా కనిపించారు.

జైపాల్ రెడ్డితో కలిసి...

జైపాల్ రెడ్డితో కలిసి...

కేంద్ర మంత్రి, మహబూబ్‌నగర్ పార్లమెంటు సీటు అభ్యర్థి ఎస్ జైపాల్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీ వేదిక మీంచి ఇలా..

డికె అరుణ పరిచయం చేస్తూ..

డికె అరుణ పరిచయం చేస్తూ..

మహబూబ్‌నగర్ జిల్లాలోని శాసనసభ, పార్లమెంటు సభ్యులను రాహుల్ గాంధీకి డికె అరుణ పరిచయం చేశారు.

రాహుల్ గాంధీతో పొన్నాల..

రాహుల్ గాంధీతో పొన్నాల..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాహుల్ గాంధీతో మాట్లాడుతూ ఇలా కనిపించారు.

రాపోలు ఆనందభాస్కర్ అనువాదం...

రాపోలు ఆనందభాస్కర్ అనువాదం...

రాహుల్ గాంధీ ప్రసంగానికి రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అనువాదం చేశారు. రాహుల్ చెప్పిందానికి మరిన్ని విషయాలు జోడించి ఆయన మాట్లాడారు.

తెరాస టార్గెట్..

తెరాస టార్గెట్..

రాహుల్ గాంధీ రెండు బహిరంగ సభల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును టార్గెట్ చేసుకున్నారు.

English summary
AICC vice president Rahul Gandhi addressed two meeting in Telangana one at Mahaboobnagar and another at Dichpalli in Nizamabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X